ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే.. ఇంకోవైపు క్యారెక్టర్, విలన్ రోల్స్‌తోనూ అదరగొడుతోంది. క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో ఆమె లక్కీ ఛార్మ్‌గా మారిపోయింది. తమిళంలో కూడా ఆమె బిజీగానే ఉంది. తమిళ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో అయిన శరత్ కుమార్ తనయురాలే వరలక్ష్మి అన్న సంగతి తెలిసిందే.
ఐతే ఇంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. వరలక్ష్మి కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొందట. ఒక టీవీ ఛానెల్ హెడ్ తన ఇంటికి ఓ సినిమా విషయమై మాట్లాడేందుకు వచ్చాడని.. ఆ చర్చ అంతా ముగిశాక మనం మళ్లీ బయట కలుద్దామని చెప్పాడని.. ఎందుకు అని అడిగితే వేరే పని కోసం అన్నాడని.. రూం బుక్ చేస్తానని అన్నాడని.. అప్పుడు విషయం అర్థమైందని వరలక్ష్మి వెల్లడించింది.
ఐతే తాను శరత్ కుమార్ కూతురినని తెలిసి కూడా ఓ వ్యక్తి ఇంత ఓపెన్‌గా ఫిజికల్ ఫేవర్ అడిగాడు అంటే.. వేరే అమ్మాయిలతో ఇండస్ట్రీ జనాలు ఎలా వ్యవహరిస్తారో తనకు అర్థమైందని వరలక్ష్మి చెప్పింది. దీంతో తాను వెంటనే సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని.. తర్వాత అతను ఆ ఛానెల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వరలక్ష్మి వెల్లడించింది.
ఈ క్రమంలోనే తాను శక్తి పేరుతో ఒక ఎన్జీవో పెట్టి ఇండస్ట్రీలో మహిళలకు అండగా నిలిచే ప్రయత్నం చేశానని వరలక్ష్మి తెలిపింది. ఇండస్ట్రీలో తనకు ఇదొక్కటే చేదు అనుభవం కాదని.. ఇలాంటి ఫేవర్స్ చేయలేదని తనను కొన్ని సినిమాల నుంచి తప్పించారని.. అయినా సరే క్యారెక్టరే ముఖ్యం అని భావించి తన రూట్లో తాను సాగిపోయానని.. అలా ఉండి కూడా ఇప్పుడు బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా మారగలిగానని.. ఇందుకు తాను గర్విస్తానని వరలక్ష్మి పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates