Movie News

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందాని విపరీతంగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఓజి విడుదల. కానీ ఇవాళ రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు పార్ట్ 1 టీజర్ లో ఇది కూడా 2024లోనే వస్తుందని అధికారికంగా ప్రకటించడం కొత్త అయోమయానికి దారి తీసింది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు పవర్ స్టార్ రిలీజులు రావడం దాదాపు అసాధ్యం. బిజినెస్ కోణంలోనూ ఇదంత సేఫ్ గేమ్ అనిపించుకోదు. మరి ఎందుకిలా చేశారనేది కొంచెం విశ్లేషించి చూద్దాం.

ఓజికి మహా అయితే ఇంకో నెల రోజులు కాల్ షీట్స్ కావాలి. ఒకవేళ టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు కనక అధికారంలోకి వస్తే పవన్ వెంటనే మేకప్ వేసుకుని సెట్స్ మీదకెళ్లే పరిస్థితి ఉండదు. కొంచెం టైం పడుతుంది. ఎంతలేదన్నా రెండు నెలలు పైగానే వదిలేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఓజి టార్గెట్ రీచ్ కావడం జరగని పని. అలా అయ్యే పక్షంలో హరిహర వీరమల్లు మొదటి భాగానికి సంబంధించిన బ్యాలన్స్ ని వేగంగా పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ కు సిద్ధం చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర లాంటివి ఉన్నాయి కాబట్టి ఇదే మంచి నిర్ణయం అవుతుంది.

నిర్మాత ఏఎం రత్నం, ఓజి ప్రొడ్యూసర్ డివివి దానయ్యలు పరస్పరం అండర్ స్టాండింగ్ తోనే ఈ స్లాట్లు పెట్టుకున్నారో లేక ఎవరికి వారు అనౌన్స్ మెంట్లు ఇచ్చుకున్నారో తెలియదు కానీ ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే హరిహర వీరమల్లు ముందు రావడమే న్యాయం. ఫ్యాన్స్ కి మాత్రం ఓజి పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ఉంది. సో ఏదీ ఖరారుగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పదేముంది. హరీష్ శంకర్ ఎంత సిద్ధంగా ఉన్నా 2025 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు. ఓజి లేట్ అయితే మాత్రం ఫ్యాన్సే కాదు సుజిత్ సైతం నిరాశపడతాడు. లెట్ సీ. 

This post was last modified on May 2, 2024 11:05 am

Share

Recent Posts

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

24 seconds ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

10 hours ago