న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు తగ్గకుండా బాక్సాఫీసు ఫలితం అందుకుంటూనే ఉన్నాడు. నిర్మాణంలో ఉన్న సరిపోదా శనివారం మీద ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న సుజిత్, బలగంతో బలంగా ఋజువు చేసుకున్న వేణు ఊడుగుల, డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ ఒక తమిళ దర్శకుడు నానినే కావాలని వెంటపడుతున్నట్టు తెలిసింది. అదేంటో చూద్దాం.
జై భీమ్ తో ఆస్కార్ రేంజ్ లో ప్రశంసలు దక్కించుకున్న టీజె జ్ఞానవేల్ ప్రస్తుతం రజనీకాంత్ తో వెట్టయన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం షూటింగ్ కు ముందు నానినే అడిగాడు. కానీ తనకు నప్పదని భావించి సున్నితంగా నో చెప్పడంతో అది కాస్తా రానా చేతికి వెళ్ళింది. అయినా సరే నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో జ్ఞానవేల్ రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇతని పట్టుదల గమనించిన నాని స్టోరీ చాలా నచ్చి ఖచ్చితంగా చేద్దామని చెప్పడంతో అక్టోబర్ తర్వాత దీనికి అడుగులు పడే అవకాశం లేకపోలేదు.
గతంలో శివ కార్తికేయన్ డాన్ తీసిన సిబి చక్రవర్తి నానితో ఒక సబ్జెక్టు ఓకే చేయించుకుని హైదరాబాద్ లో ఆఫీస్ తీసిచ్చాక ఫైనల్ వెర్షన్ తో మెప్పించలేకపోయాడు. కానీ జ్ఞానవేల్ తో ఆ సమస్య రాదు. జై భీమ్ లో సున్నితమైన సమస్యని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన విధానం ఏకంగా సూపర్ స్టార్ పిలుపు వచ్చేలా చేసింది. అలాంటిది నాని ఓకే చెప్పకపోవడం అనే సమస్యే ఉండదు. కాకపోతే కన్ఫర్మ్ గా తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆగస్ట్ చివరి వారంలో విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద నాని నమ్మకం మాములుగా లేదు. స్పీడ్ తగ్గించి మరీ ఎక్కువ డేట్లు ఇచ్చాడు.
This post was last modified on May 1, 2024 7:34 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…