Movie News

మహేష్ బాబు రాజమౌళి పక్కా ప్లాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందానే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షక లోకం మొత్తంలో ఉంది. ఉగాదికి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా ఈ తీపి  కబురు చెబుతారనే టాక్ వచ్చింది కానీ తీరా చూస్తే పండగ రోజు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దీని వెనుక వేరే ప్లాన్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన కబుర్లు పంచుకునే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.

ప్రస్తుతం మహేష్ తన హెయిర్ స్టైల్ ని మార్చేశాడు. జుత్తు పెంచి వెనుకాల జులపాల లాగా స్టయిలింగ్ చేయిస్తున్నాడు. ఏదైనా ఈవెంట్ కు హాజరవుతున్న మహేష్ దాన్ని దాచి పెట్టడం లేదు. ఓపెన్ గానే తిరుగుతున్నాడు. ఇది జక్కన్న కోసమేననే ప్రచారాన్ని కొట్టి పారేయలేం. ఇంకో వారం రోజుల్లో ఫోటో షూట్ జరగొచ్చట. ఫారెస్ట్ అడ్వెంచర్ కాబట్టి అడవిలో తిరిగే మహేష్ పాత్ర తాలూకు తీరుతెన్నుల మీద విస్తృతంగా స్టడీ చేసిన రాజమౌళి దానికి అనుగుణంగా కాస్ట్యూమ్స్ సిద్ధం చేయించారు. చిన్న టీజర్ ఆలోచన చేశారు కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యారట.

సో మొత్తానికి ఎదురు చూస్తున్న శుభఘడియలు వస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ వేసవి తర్వాత మొదలవ్వొచ్చు. అధిక శాతం ఇండోర్ సెట్స్ లోనే తీయబోతున్నారు. గ్రీన్ మ్యాట్ లో తొలుత సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాత విఎఫెక్స్ ఎఫెక్ట్స్ ని జోడించబోతున్నారు. 2026 విడుదల లక్ష్యంగా పని చేయబోతున్నారు. రెండు భాగాలు ఉండటం దాదాపు ఖాయమే. కానీ బయటికి చెప్పడం లేదు. శ్రీ దుర్గా ఆర్ట్స్ తో పాటు ఏఏ నిర్మాణ సంస్థలు భాగస్వామిగా ఉంటాయనే దాని మీద ఇంకా కంక్లూజన్ కు రాలేదు. టాలీవుడ్ లోనే కాదు నార్త్ లోనూ ఎస్ఎస్ఎంబి 29 మీద మాములు హైప్ లేదు. 

This post was last modified on April 29, 2024 11:09 am

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

23 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

38 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

38 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago