Movie News

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో ఒక పోస్టర్ ని షేర్ చేసి స్వీట్ షాక్ ఇచ్చింది. బంగారం పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి దర్శకుడు, నిర్మాత, క్యాస్టింగ్ ఇతర వివరాలేవీ లేకుండా కేవలం స్టిల్ మాత్రమే ఇచ్చారు. టైటిల్ పైన చిన్నగా మా ఇంటి ఉపశీర్షీక పెట్టారు. ఎర్ర చీర, నుదుట గాయం, చేతిలో తుపాకీ, క్రూరమైన చూపులు, ఏదో రివెంజ్ కోసం వెళ్తున్నట్టు చూపులు మొత్తానికి డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది. బంగారం పదాన్ని హైలైట్ చేస్తున్న సామ్ అంతర్గతంగా కథ గోల్డ్ చుట్టూ తిరుగుతుందని హింట్ ఇచ్చినట్టే.

సమంతాకు గత ఏడాది శాకుంతలం డిజాస్టరయ్యాక ఖుషి కొంత ఊరట కలిగించింది కానీ భారీ విజయాన్ని నమోదు చేసుకోలేదు. అమెజాన్ ప్రైమ్ తీసిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ విడుదల ఆలస్యమవుతోంది. దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. ఆఫర్లు ఎన్ని వచ్చినా ఎదురు చూస్తూ వచ్చి మొత్తానికి సరైన టైంలో మంచి అనౌన్స్ మెంట్ పంచుకుంది. చూస్తుంటే యశోద తరహాలో ఇది కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలా అనిపిస్తోంది. కాకపోతే సోషల్ మెసేజ్ గట్రా లేకుండా ఏదో సీరియస్ థీమ్ ని తీసుకున్న వైనం స్పష్టం. ఇది బ్రేక్ ఇస్తే మళ్ళీ కెరీర్ ఊపందుకుంటుంది.

నిజానికి సమంతాకు అవకాశాలు ఆగిపోలేదు. కథలతో దర్శకులు కలుస్తున్నారు కానీ తనకు అంతగా నచ్చడం లేదట. అనారోగ్యంతో బాధ పడి కొంత గ్యాప్ తీసుకున్న సామ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టే. బయట ఈవెంట్లలో తరచుగా కనిపిస్తోంది. ఇటీవలే పెళ్లి దుస్తులను రీ డిజైన్ చేయించుకోవడం కూడా వార్తగా మారే రేంజ్ లో తన కదలికలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో సమంతా పేరు పరిశీలనలో ఉందన్నారు కానీ ఇంకా ఆ ప్రాజెక్టే అఫీషియల్ గా చెప్పలేదు కాబట్టి కొంత టైం వేచి చూస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

This post was last modified on April 28, 2024 4:18 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago