అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి సెలవులన్నీ పూర్తయ్యాక వచ్చే ఇలాంటి డ్రై డేట్ ని ఎందుకు ఎంచుకున్నారనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. అయితే ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. బోలెడు మేధోమథనం జరిగింది. అదెలాగో చూద్దాం. మే నెల దాదాపుగా వచ్చేసింది కాబట్టి ప్రమోషన్లకు టైం సరిపోని కారణంగా దీన్ని ఎంచుకోవడానికి లేదు. పైగా మే 13 ఎన్నికలు జరిగే వరకు ఆ మూడ్ నుంచి ప్రేక్షకులు బయటికి రారు. దేశమంతా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
జూన్ మొదటి రెండు వారాల్లో ఏదో ఒక డేట్ కి ఖచ్చితంగా భారతీయుడు 2 వచ్చేస్తుంది. ఇంకా ప్రకటించలేదు కానీ దర్శకుడు శంకర్ చివరి దశ పనుల్లో అవ్వగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. లైకా సంస్థ ఆల్రెడీ ఎగ్జిబిటర్లతో 13వ తేదీకి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెన్నై టాక్. సో రెండు సినిమాల్లో కమల్ హాసన్ ఉన్నారు కాబట్టి వీటి మధ్య కనీస గ్యాప్ అవసరం. అందుకే జూన్ 27 మంచి ఆప్షన్ అవుతుంది. పైగా జనవరి నుంచి లెక్కేసుకుంటే సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా గర్వంగా చెప్పుకునే ప్యాన్ ఇండియా మూవీ ఏదీ రాలేదు. ఉత్తరాదిలో బడేమియా చోటేమియా లాంటివి ఘోరంగా బోల్తా పడ్డాయి.
హాలిడేస్ అయ్యాయనే ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఎప్పడు వచ్చినా టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు వసూళ్ల వరద ఖాయం. నెగటివ్ ట్రోలింగ్ కు గురైన ఆదిపురుష్ ఇదే జూన్ లో వచ్చి మూడు వందల కోట్లకు పైగా రాబట్టింది. బాహుబలి 1 బిగినింగ్ రిలీజయ్యింది జూలై 10న. ఎంత చరిత్ర సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడొచ్చే కల్కి దాని కన్నా కేవలం రెండు వారాలు ఆలస్యంగా వస్తోంది అంతే. సో సెలవులను క్యాష్ చేసుకోలేదనే ఇబ్బంది ఉండదు. పైగా ఆలోగా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉంటుంది కాబట్టి టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వ్యవహారాలు ప్రశాంతంగా చూసుకోవచ్చు.
This post was last modified on April 28, 2024 11:57 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…