గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్ సేన్ లోని నటుడిని ఇంకా మెరుగ్గా పరిచయం చేయడంతో పాటు కమర్షియల్ గానూ గట్టెక్కడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో మే 17 రాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత డిసెంబర్ నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ విలేజ్ డ్రామాకు రౌడీ ఫెలో – చల్ మోహనరంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకుడు. టిల్లు స్క్వేర్ హిట్ తో జోరు మీదున్న సితార నిర్మాణంలో రూపొందింది. ఇవాళ హైదరాబాద్ లో టీజర్ లాంచ్ చేశారు.
పచ్చని గోదావరి ప్రాంతంలో పగలు రాజ్యమేలిన కాలమది. ఒక్కసారి కత్తి పట్టినోడు దానికే బలి కావాలనే మనస్తత్వాలు రక్తపాతం సృష్టిస్తాయి. మంచోడనే చెడ్డ పేరు నాకొద్దని తిరిగే ఓ యువకుడి (విశ్వక్ సేన్) కి స్వంత వాళ్లే శత్రువులు అవుతారు. దీంతో అమ్మోరు పూనినట్టు ఓ రాత్రి విలయతాండవం చేసి తెగ నరకడం మొదలు పెడతాడు. అసలు అక్కడ ముఠా కక్షలకు పునాది వేసింది ఎవరు, హాయిగా గడిచే జీవితాల్లో ఇందుకు అలజడి మొదలయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడమంటున్నారు. ట్రైలర్ కాదు కాబట్టి ఎక్కువ కంటెంట్ రివీల్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు.
పక్కా పల్లెటూరి ఊర మాస్ పంచెకట్టు, మీసకట్టుతో విశ్వక్ సేన్ కొత్తగా ఉండటమే కాదు పాత్ర డిమాండ్ చేసిన మేరకు వయోలెంట్ వేరియేషన్స్ చూపించినట్టు శాంపిల్స్ చూస్తేనే అర్థమైపోతోంది. రంగస్థలం తర్వాత ఆ స్థాయి డెప్త్ ఉన్న కంటెంట్ మళ్ళీ ఇందులో కనిపిస్తోంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఘాడతని పెంచగా అనిత్ మదాడి ఛాయాగ్రహణం విజువల్స్ ని రిచ్ గా చూపిస్తోంది. నేహా శెట్టి, అంజలి, సాయికుమార్, నాజర్, గోపరాజు రమణ, పృథ్వి, ప్రవీణ్ ఇలా క్యాస్టింగ్ పెద్దదే ఉంది కానీ చూపలేదు. ఇలాంటి మాస్ బొమ్మ చూసి బాగా గ్యాప్ వచ్చేసింది. సో గ్యాంగ్స్ అఫ్ గోదావరికిది బంగారం లాంటి అవకాశం.
This post was last modified on April 27, 2024 5:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…