ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందబోయే స్పిరిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని ప్రభాస్ అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యానిమల్ లో రన్బీర్ కపూర్ లాంటి సాఫ్ట్ హీరోతో ఆ రేంజ్ లో మతి పోగొట్టిన సందీప్ ఇక మాస్ ఐకాన్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడోననే ఎగ్జైట్ మెంట్ ఉండటం సహజం. దానికి తగ్గట్టుగానే చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. పోలీసులు ఇలా కూడా ఉంటారా అనే తరహాలో ప్రభాస్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారు. వయొలెన్స్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని మళ్ళీ చెప్పనక్కర్లేదు.
ప్రభాస్ కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పిరిట్ ఆలస్యమవుతుందేమోననే అనుమానాలకు చెక్ పెడుతూ సందీప్ రెడ్డి వంగా ఈ అక్టోబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడట. ఇటీవలే చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చేశాడు. అంటే జూన్ తర్వాత కల్కి 2898 ఏడితో డార్లింగ్ కు పనుండదు. వెంటనే ది రాజా సాబ్ సెట్స్ లోకి అడుగు పెడతాడు. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంకు ప్రశాంత్ నీల్ ఇంకాస్త ఎక్కువ సమయం అడగటంతో దాని స్థానంలో స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారని ఇన్ సైడ్ టాక్. ప్రకటన ఇవ్వడానికి ముందు పరిస్థితులను బేరీజు వేసుకోబోతున్నారు.
ఇదే జరిగితే అనుకున్న దానికన్నా ముందే స్పిరిట్ 2025లోనే చూసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. హను రాఘవపూడి దర్శకత్వంలో చేయాల్సిన ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ వెర్షన్ పూర్తవ్వలేదు కాబట్టి షూట్ కి టైం పట్టేలా ఉంది. 2024 డిసెంబర్ కల్లా ది రాజా సాబ్ గుమ్మడికాయ కొట్టేసి స్పిరిట్ కనీసం పాతిక శాతం పూర్తయ్యేలా చూసుకోవాలి. కల్కికి ఒకవేళ రెండో భాగం ఉంటే ఇక్కడ చెప్పిన లైనప్ లో మార్పులు చోటు చేసుకుంటాయి. సీక్వెల్ గురించి వైజయంతి మేకర్స్ గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. సో ప్రభాస్ సినిమాల వరస ఖచ్చితంగా చెప్పలేం. సలార్ 2 గురించి నీల్ చెప్పాలి.
This post was last modified on April 27, 2024 2:49 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…