టాలీవుడ్ యాంకర్లలో సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మి, శ్రీముఖిల స్థాయిలో ఎక్కువ పాపులర్ ఏమీ కాలేదు కానీ.. ఉన్నంతో మంచి గుర్తింపే ఉంది విష్ణు ప్రియకు. బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. యాంకరింగ్ మీద ప్యాషన్‌తో టీవీ రంగంలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.
ఐతే యాంకరింగ్ కంటే కూడా గ్లామర్, ఇతర స్కిల్స్‌తోనే ఆమె ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. విష్ణు ప్రియలో మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్న విషయం కొన్ని టీవీ షోల్లో చూశాం.
ప్రస్తుతం లాక్ డౌన్ టైంలో ఆమె ఇంటి నుంచే ఫొటో షూట్లతో పాటు వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా విష్ణు ప్రియ నుంచి వచ్చిన డ్యాన్సింగ్ వీడియో ఒకటి ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది.
ఓ ఇంగ్లిష్ పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులేసింది విష్ణు ప్రియ. ఈ వీడియో తన ఇంట్లోనే తీసినట్లుగా ఉంది. సెక్సీగా ఉండే డ్రెస్ వేసి.. నడుమును స్ప్రింగులా తిప్పుతూ విష్ణు ప్రియ వేసిన స్టెప్పులు మతి పోగొట్టేస్తున్నాయి. ఆమె గ్రేస్, స్పీడ్ చూస్తే టాప్ డ్యాన్సర్లకు ఏమాత్రం తీసిపోదు అనిపిస్తోంది.
ఈ వీడియో చూసి క్వారంటైన్లో కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా టీవీలో ఓ పాట ప్లే అవుతుంటే.. దానికి ఆమె వేసిన సెక్సీ డ్యాన్స్ వైరల్ అయింది. తాజా వీడియో దాన్ని మించి పోయింది.
మరోవైపు విష్ణు ప్రియ ఫొటో షూట్లు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు విష్ణు ప్రియకు టీవీ రంగంలో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి మరి.
This post was last modified on April 27, 2020 5:34 pm
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…