కొందరి సినీ తారల జీవితాల్లో తెరమీద చూపించినట్టు ఒకరితోనే జీవితం పంచుకోవడం ఉండదు. ముందు ప్రేమించడం, కొంత కాలం సహజీవనం లేదా పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బ్రేకప్ సర్వసాధారణ విషయాలు. తాజాగా శృతి హాసన్ ఈ విషయంలోనే సర్వత్రా హైలైట్ అవుతోంది. నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉన్నా అవకాశాలు, హిట్లు రెండూ కొదవ లేకుండా చేసుకుంటున్న లోక నాయకుడి తనయ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాకు గుడ్ బై చెప్పినట్టు వచ్చిన వార్త టాపిక్ గా మారింది. ఇన్స్ టాలో పరస్పరం అన్ ఫాలో కొట్టేసుకోవడమే దానికి సూచికని చెబుతున్నారు.
మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళ బంధం కొనసాగుతోంది. కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకోవడం అన్నీ జరిగాయి. ఇతనికన్నా ముందు ఇటాలియన్ నటుడు మైకేల్ కొర్సాలేతో రిలేషన్ షిప్ నడిపించిన శృతి అతన్ని ఏకంగా కొన్ని ఫంక్షన్లకు తీసుకెళ్లి మరీ పరిచయం చేయడం వైరలయ్యింది. కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే సిద్దార్థ్, ధనుష్, చైతు, సురేష్ రైనా ఇలా ఏవేవో పేర్లు శృతి ప్రేమకథల గురించి మీడియాలో వచ్చేవి. ఏది నిజం ఏది అబద్దం అనేది తనకే తెలుసు కానీ చూస్తుంటే ఇప్పట్లో సెటిలయ్యే ఉద్దేశం లేదేమో.
తండ్రి కమల్ హాసన్ బాటే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం శృతి ప్రభాస్ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంతో పాటు అడవి శేష్ డెకాయిట్ లో నటిస్తోంది. రెండూ ప్యాన్ ఇండియా సినిమాలే. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్నవి బాగానే వస్తున్నాయి. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రూపంలో రెండు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ కు ఛాన్సులకైతే లోటు లేదు. చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీలోనూ ఆఫర్ పట్టేసింది. ముందు సమంతాతో అనుకుని ఆ తర్వాత అనూహ్యంగా అది శృతి చేతికి వచ్చింది. అటు వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
This post was last modified on April 26, 2024 11:13 am
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డుకు చాలా విశిష్ఠత ఉంది. ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ఆరుగురు సభ్యులతో ఏర్పడిన…
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…