రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. తన మీద బయోపిక్ తీయడానికి తనే రంగం సిద్ధం చేశాడు. అందులో ఆయనే నటించబోతున్నాడు కూడా. మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వర్మ కాలేజీ రోజుల నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదటి భాగమంతా వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు రోజుల నేపథ్యంలో నడుస్తుంది. బుధవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ హాజరు కావడం విశేషం. సూర్యవతి కెమెరా స్విచాన్ చేస్తే.. విజయ క్లాప్ ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు 20 ఏళ్ల వయసున్న దొరసాయి తేజ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్‌లో యంగ్ ఆర్జీవీగా నటించబోయేది కూడా అతనే కావడం విశేషం. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు.
బొమ్మకు మురళి నిర్మాణంలో ‘రాము’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని పూర్తిగా వర్మ పుట్టి పెరిగిన విజయవాడలోనే తెరకెక్కించనున్నారు. వర్మ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిన రోజుల నేపథ్యంలో రెండో భాగం నడుస్తుంది. అందులో వర్మ పాత్రను వేరే నటుడు చేస్తాడట. ఆ తర్వాత వర్తమాన నేపథ్యంలో సాగే మూడో భాగంలో వర్మ పాత్రను వర్మే పోషించనున్నాడు.
బహుశా అందులో వర్మ పతనాన్ని చూపిస్తారేమో. ఇలా ఒక ప్రముఖుడి బయోపిక్‌లో ఆ వ్యక్తే నటించడం అరుదైన విషయమే. మరి గత దశాబ్ద కాలంలో ఫిలిం మేకర్‌గా, వ్యక్తిగా బాగా దిగజారిపోయిన వర్మ.. ఉన్నదున్నట్లుగా సినిమాలో చూపించడానికి ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఎన్నో ఆసక్తికర మలుపులతో ముడిపడ్డ వర్మ జీవితాన్ని సరిగ్గా చూపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 3:31 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…