Movie News

శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు

ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు షూట్ చేస్తూ విపరీతమైన ఒత్తిడిని ఏదోలా నెట్టుకుంటూ వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకున్నారు. ఒక పక్క భారతీయుడు 2 షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఒక కొలిక్కి వస్తోంది. ఈ సందర్భంగా 1996 భారతీయుడు రీ రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారు మొదటి భాగం నిర్మాత ఏఎం రత్నం. కానీ సీక్వెల్ విడుదల జూన్ అని చెప్పారు కానీ ఇప్పటిదాకా డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం కమల్ హాసన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరినీ ఖంగారు పెడుతోంది. ఎందుకంటే క్లారిటీ వస్తే తప్ప ప్రమోషన్లు ప్లాన్ చేయడం సాధ్యం కాదు.

ముందు భారతీయుడు 2 సంగతి తేలాలి. కల్కి 2898 ఏడి మే, జూన్, జూలైలో ఎప్పుడు తేవాలనే విషయంలో నిర్మాత అశ్వినీదత్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంతకీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఇతర ప్రొడ్యూసర్లు తలో అభిప్రాయం చెప్పడం ఒత్తిడిని పెంచుతోంది. అందుకే ఎన్ని సందర్భాలు వచ్చినా డేట్ మాత్రం వేయలేకపోతున్నారు. రెండింట్లో తానున్నాను కాబట్టి ఇండియన్ 2తో క్లాష్ రాకుండా చూసుకోమని కమల్ హాసన్ ముందే చెప్పారు. సో శంకర్ వీలైనంత త్వరగా ఆకుపచ్చ జెండా ఊపాలి. నిర్మాణ సంస్థ లైకా తన బయ్యర్లతో డీల్స్ ఇంకా ఫైనల్ చేసుకోలేదు.

ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే షూటింగ్ జరుగుతూనే ఉంది. వేసవిలో గుమ్మడికాయ కొట్టడం ఖాయమే. భారతీయుడు ప్రమోషన్ల కోసం జూన్ మొత్తం శంకర్ అందుబాటులో ఉండరు. అది కూడా వాయిదా పడకపోతేనే సుమా. రామ్ చరణ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఉన్నాయి. ఎంతలేదన్నా మూడు నెలలకు పైగానే పడుతుందట. టార్గెట్ గా పెట్టుకున్న అక్టోబర్ ని చేరుకోవాలంటే పరుగులు పెట్టాల్సిందే. అటు లైకా ప్రొడక్షన్స్ ఇటు దిల్ రాజు ఇద్దరూ శంకర్ వైపు నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్యాసింజర్ రైలులా త్వరగా వచ్చేలా లేదు.

This post was last modified on April 26, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

5 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago