కథను దర్శకుడిని నమ్మేస్తే దిల్ రాజు ఎంత ఖర్చుకైనా వెనుకాడరనేది తెలిసిన విషయమే. అయితే స్టార్ల విషయంలో దీని గురించి పెద్దగా టెన్షన్ ఉండదు కానీ మీడియం రేంజ్ హీరోలతో మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ ఫైట్ కం ఛేజ్ ని ఏకంగా 8 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నితిన్ ప్రస్తుత మార్కెట్ కి ఇది భారీ మొత్తం. అయినా సరే లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారు.
యూనిట్ టాక్ ప్రకారం ఈ ఎపిసోడ్ అక్క లయను కాపాడేందుకు తమ్ముడు నితిన్ చేసే సాహసమట. కలెక్టర్ గా పని చేసే తన సోదరి వెనుక ప్రమాదకర శక్తులు పడినప్పుడు తోబుట్టువుగా ప్రాణాలకు తెగించే పాత్రలో నితిన్ లో మంచి మాస్ చూపిస్తారట. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ రూపంలో సక్సెస్ అందుకున్నా వేణు శ్రీరామ్ కు గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో అనుకున్న ఐకాన్ డ్రాప్ కావడంతో దాని స్థానంలోనే దిల్ రాజు ఈ తమ్ముడు ఆఫర్ ని చేతిలో పెట్టారు. పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకుంటున్నందుకు దానికి తగిన న్యాయం చేయమని అభిమానులు కోరుతున్నారు.
చూస్తుంటే నితిన్ కెరీర్ లోనే తమ్ముడు కాస్ట్లీ మూవీగా మారుతోంది. ఈ యూత్ హీరోకి గత కొన్నేళ్లుగా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఎక్స్ ట్రాడినరి మ్యాన్, మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్లు కాగా మాస్ట్రో నేరుగా ఓటిటిలో వచ్చి సేఫ్ అయ్యింది. రంగ్ దే సోసోగా అడగా చెక్ తేడా కొట్టింది. భీష్మ తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు కొట్టలేదు. ఇప్పుడు తమ్ముడుతో పాటు వెంకీ కుడుములతో చేస్తున్న రాబిన్ హుడ్ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాయనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. రెండూ పెద్ద బ్యానర్లు కావడంతో నిర్మాణపరంగా కూడా రాజీ లేదు. తమ్ముడు విడుదలకు సరైన స్లాట్ కోసం దిల్ రాజు డేట్లను యనాలసిస్ చేసే పనిలో ఉన్నారట.
This post was last modified on April 24, 2024 6:59 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…