Movie News

ఫ్లాపులున్నా అవకాశాలకు లోటు లేదు

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక వెనుకబడినట్టు కనిపిస్తోంది కానీ రాశిఖన్నాకు అవకాశాల పరంగా లోటేమీ లేదు. బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత జెండా పాతాలని ప్రయత్నించింది కానీ మెగా ఫ్లాప్ స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడింది. గత నెల ఎన్నో ఆశలు పెట్టుకుని సిద్ధార్థ్ రాయ్ జోడిగా నటించిన యోధ దారుణంగా బోల్తా కొట్టగా ఆగస్ట్ 2 విడుదల కాబోతున్న వివాదాస్పద అంశాల ది సబర్మతి రిపోర్ట్ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది. దీనికన్నా ముందు మే 3 రిలీజవుతున్న బాక్ (అరణ్మయి 4) గురించి కోలీవుడ్ లో మంచి బజ్ ఉంది. తమన్నాతో కలిసి నటించిన హారర్ మూవీ ఇది.

ఇవి కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మంచి ప్రాధాన్యం దక్కేలా దర్శకురాలు నీరజ కోన డిజైన్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. మేధావి అనే మరో తమిళ సినిమా నిర్మాణంలో ఉంది. ఇంకో బాలీవుడ్ మూవీ ప్రతిపాదన దశలో ఉంది. ఇవన్నీ చూస్తే ఒకటో రెండో హిట్ అయినా చాలు కెరీర్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయం. నితిన్ రాబిన్ హుడ్ నుంచి శ్రీలీల తప్పుకున్నాక రాశిఖన్నాను దాదాపు ఓకే చేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఊరికే నిప్పులేనిదే పొగరాదుగా అనుకోవచ్చు.

కొన్నేళ్ల క్రితం దాకా హిట్లలో ఉండి ఇప్పుడిలాంటి గ్రాఫ్ చూడటం కొంచెం ఇబ్బందే అయినా ఇన్నేసి ఆఫర్లు చేతిలో ఉండటం విశేషమే. వెబ్ సిరీస్ రుద్రా, ఫర్జీలతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా కథలు బాగుంటే ఏ భాషలో అయినా నటిస్తానని చెబుతోంది. ఒక దశలో చిరంజీవి విశ్వంభర, బాలయ్య 109కు తన పేరే పరిశీలించారు కానీ ఎందుకో మరి ఫైనల్ కాలేదు. సీనియర్ హీరోల సరసన నటించేందుకు సానుకూలంగా ఉంటే ఎక్కువ ఛాన్సులు వస్తాయి. త్రిష, నయనతార లాంటి వాళ్ళు ఇంకా డిమాండ్ లో ఉన్నారంటే కారణం ఇదే. అలాంటి బ్రేక్ ఒకటి రాశిఖన్నాకు దక్కాలి.

This post was last modified on April 24, 2024 3:04 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

35 minutes ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago