హనుమాన్ విడుదలకు ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు అవకాశం దొరికితే అవతార్ లాంటి సినిమా తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెబితే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటూ నెటిజెన్లు ట్రోల్ చేశారు. ముగ్గురు పెద్ద స్టార్ల పోటీని తట్టుకుని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూశాక ఎవరూ నోరు విప్పలేదు. కట్ చేస్తే హనుమాన్ దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. డైరెక్ట్, షిఫ్ట్ అన్ని కలిపి పాతిక పైగా కేంద్రాలు వచ్చినట్టు ట్రేడ్ టాక్. నిన్న హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఘనంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ ప్లాన్స్ చెప్పాడు.
సినిమాటిక్ యునివర్స్ మీద ఇంకో ఇరవై ఏళ్ళు పని చేస్తానని, తనతో పాటు ఇతర దర్శకులు ఇందులో భాగమవుతారని, సౌత్ నుంచి నార్త్ దాకా ఎందరో స్టార్లు వీటిలో నటిస్తారని చెప్పుకొచ్చాడు. అంటే తన కెరీర్ మొత్తం దీనికే అంకితం చేయబోతున్నాననే సంకేతం స్పష్టంగా ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ దగ్గర చాలా ఫాంటసీ కథలున్నాయి. నెక్స్ట్ లైన్ లో ఉన్న అధీరా కూడా అలాంటిదే. జై హనుమాన్ గురించి తెలిసిందే. అందరు సూపర్ హీరోలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అవెంజర్స్ తరహాలో టాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ ఫ్రాంచైజ్ ఇవ్వాలనేది ఈ యువ దర్శకుడి జీవిత లక్ష్యంగా కనిపిస్తోంది.
చూస్తుంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. కమర్షియల్ జానర్ ని టచ్ చేయకుండా కేవలం సూపర్ హీరోలతో సినిమాలు చేయడమనేది బడ్జెట్, మార్కెట్ రెండింటి పరంగా పెద్ద బాధ్యతతో కూడుకున్నది. పైగా హాలీవుడ్ లో మాత్రమే ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతూ వచ్చింది కానీ ఇండియాలో ఎవరూ చేయలేకపోయారు. హృతిక్ రోషన్ క్రిష్ సైతం మూడో భాగం తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అక్కడ రాకేష్ రోషన్ వయసు ఇబ్బంది పెడుతోంది. కానీ ప్రశాంత్ వర్మకు ఆ సమస్య లేదు. ఒకవేళ అన్ని హిట్ అయితే మాత్రం నిజంగానే ఇండియాకో అవతార్ ఇచ్చేలా ఉన్నాడు.
This post was last modified on April 24, 2024 12:18 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…