ఇప్పుడు టాలీవుడ్లోనే కాక అన్ని సినీ పరిశ్రమల్లోనూ సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల ప్రభావమే అందుక్కారణం. ఏ హిట్టు సినిమానూ ఊరికే అలా వదిలేయకుండా.. కొనసాగింపు చిత్రాలు తీసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డిజాస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని క్లాసిక్ మూవీ ‘జెర్సీ’ సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో అర్జున్ పాత్రకు ప్రేక్షకులు ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో మరోసారి రుజువైంది. కాగా ఇదే సమయంలో అల్లరి నరేష్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ లాంచ్ వేడుకకు హాజరైన నానిని ‘జెర్సీ’ సీక్వెల్ గురించి అడిగారు విలేకరులు.
ఐతే ‘జెర్సీ’లో తన పాత్ర చచ్చిపోయింది కాబట్టి తాను జెర్సీ-2 చేయలేనని.. వేరే వాళ్లు ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చని నాని తేల్చేశాడు. తద్వారా తానైతే ‘జెర్సీ-2’ చేయలేని నాని చెప్పకనే చెప్పేశాడు. పెద్ద నాని చనిపోయినా కొడుకు పాత్రలో నాని రీఎంట్రీ ఇచ్చి సీక్వెల్ చేయొచ్చుగా అనే అనుమానం కలగొచ్చు. కానీ ‘జెర్సీ’లో నాని కొడుకు పెద్దవాడైనట్లు క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఆ పాత్రలో తమిళ నటుడు హరీష్ కళ్యాణ్ కనిపించాడు కూడా. కాబట్టి మళ్లీ నానిని పెట్టి సీక్వెల్ తీయడానికి వీల్లేదు.
హరీష్ కళ్యాణ్‌కు తెలుగులో అంతగా గుర్తింపు లేదు. అలాంటపుడు అతణ్ని పెట్టి జెర్సీ-2 చేయడం కూడా కష్టమే. అసలు ‘జెర్సీ’ లాంటి కథలను అక్కడితో ముగించేస్తేనే బాగుంటుంది. దానికి మళ్లీ సీక్వెల్ తీసినా అంత బాగోదన్నది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం కావచ్చు.
This post was last modified on April 24, 2024 5:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…