ఇప్పటిదాకా విడుదలైన 2024 సినిమాలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ఫ్రీ షోతో పాటు వంద రోజుల వేడుక చేయబోతున్నారు. ఈ సందర్భంగా పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా చెబుతారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జై హనుమాన్ ని ప్రత్యేకంగా ఐమాక్స్ వెర్షన్ లో షూట్ చేయబోతున్నట్టు, పూర్తిగా 3డి వెర్షన్ లో ఎంజాయ్ చేయొచ్చని నిర్మాతలు అఫీషియల్ గా ఒక కొత్త పోస్టర్ తో ప్రకటించారు. వినడానికి బాగానే ఉంది తెలుగు అభిమానులకు మాత్రం నిరాశే.
ఎందుకంటే ఏపీ, తెలంగాణలో బోలెడు థియేటర్లున్నా ఎక్కడా ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్ లేదు. దేశం మొత్తం ప్రధాన నగరాల్లో ఈ తెరలను పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి కానీ కనీసం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు కూడా ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఉన్నంతలో ఏషియాలోనే అతి భారీ భారీ స్క్రీన్లను ప్రసాద్ కార్పొరేషన్, వి సెల్యులాయిడ్(సూళ్లూరు పేట) ఏర్పాటు చేశాయి కానీ వాటిలో వాడే టెక్నాలజీ ఐమాక్స్ తో సమానం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరల నిబంధనలే ఐమాక్స్ కు అడ్డుగా ఉన్నాయనే టాక్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో ఉంది.
ఒక తెలుగువాడు భారీ సాంకేతికతతో సినిమా తీస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఛాన్స్ అందరికీ లేకపోవడం గురించి ఇకనైనా సీరియస్ గా ఆలోచించాలి. తక్కువ థియేటర్లు నడిచే కేరళ, తమిళనాడులో ఐమాక్స్ లు ఉండగా ఇక్కడ ఊసే లేకపోవడం విచారకరం. జై హనుమాన్ బడ్జెట్ దీన్ని బట్టే ఎంత భారీ పెంచారో అర్థం చేసుకోవచ్చు. రాముడు, హనుమంతుడుగా ఎవరు నటిస్తారోననే యాంగ్జైటీ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఆ సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. అయితే గతంలో ప్రకటించినట్టు 2025 సంక్రాంతి విడుదల జై హనుమాన్ కు సాధ్యం కాదు. అందుకే వేసవిని టార్గెట్ చేస్తారని టాక్.
This post was last modified on April 23, 2024 5:00 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…