బాలీవుడ్ ప్రముఖులకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపై ఒకప్పుడు తరచుగా చర్చ జరుగుతుండేది. పాకిస్థాన్‌లో సెటిలైపోయిన దావూద్ గురించి ఇప్పుడు పెద్దగా వార్తలేమీ రావట్లేదు కానీ.. ఈ తరహా వార్తలు రోజూ వస్తుండేవి. అలాగే లెజెండరీ హీరోయిన్ డింపుల్ ఖన్నా కూతురు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అయిన ఒకప్పటి నటి ట్వింకిల్ ఖన్నా గురించి కూడా ఒకప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ అయింది.
ఆమె దావూద్ నిర్వహించిన ఓ పార్టీలో డబ్బు కోసం డ్యాన్స్ చేశారంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్త దుమారం రేపింది. తర్వాత ఇతర మీడియాల్లో కూడా దాని గురించి వార్తలు వచ్చాయి. ఆ అంశంపై ఇప్పుడు ట్వింకిల్ ఓపెన్ అయింది.
“నేను దావూద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో ఓ టీవీ ఛానెల్ వార్తలు వడ్డించింది. అది చూసి నా పిల్లలు నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరూ నమ్మలేదు. నేనేమీ గొప్ప డ్యాన్సర్‌ను కాదు. దావూద్ కావాలనుకుంటే ఇంకా మంచి డ్యాన్సర్లను పెట్టుకుంటాడనే విషయాన్ని ఆ ఛానెళ్లు గ్రహించాల్సింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఫేక్ వార్తలు చూశాం. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో కూడా ఎన్నో ఫేక్ వార్తలు సృష్టించారు. వాటిని జనం నిజమని నమ్మారు టెక్నాలజీని ఉపయోగించుకుని అబద్ధపు వార్తలు పుట్టిస్తున్నారు. ఇటీవల రెజ్లర్లు నిరసన ప్రదర్శన చేస్తుంటే.. అందులో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేశారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలే జరిగాయి. అలాంటిదే దావూద్ పార్టీలో నేను డ్యాన్స్ చేశాననే వార్త” అని ట్వింకిల్ పేర్కొంది.
This post was last modified on April 22, 2024 8:59 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…