Movie News

టాలీవుడ్లో ఓటీటీ వేడి

మిగతా ఇండస్ట్రీలు ఓటీటీ రిలీజ్‌ విషయంలో చాలా ముందంజలో ఉంటే.. టాలీవుడ్ మాత్రం అంతగా ఆసక్తి లేనట్లు కనిపించింది. హిందీలో పేరున్న సినిమాలు జూన్ నెల నుంచే ఓటీటీల్లో విడుదలవుతూ వచ్చాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా కాస్త పేరున్న సినిమాలు ఇలా రిలీజయ్యాయి. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ధైర్యం చేయలేదు.

రెండు మూడు నెలలు ఆగితే థియేటర్లు తెరుచుకుంటాయన్న ఆశాభావంతో ఎదురు చూశారు. మధ్యలో కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి కానీ.. కొంచెం రేంజ్ ఉన్న సినిమాలేవీ ఇటువైపు చూడలేదు. కానీ ఆరు నెలలైనా థియేటర్లు తెరుచుకోకపోవడంతో మన నిర్మాతల ఆలోచనలు మారిపోయాయి.

ఈ మధ్యే ‘వి’ లాంటి పెద్ద సినిమాను నేరుగా అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా ఆశించిన స్పందన రాబట్టుకోవడంతో కొన్ని రోజుల పాటు స్తబ్దత నెలకొంది. కొత్త ఓటీటీ రిలీజ్‌ల విషయంలో ఎలాంటి అప్ డేట్లు లేకపోయాయి.

దీంతో ప్రేక్షకుల్లో నిరాశ కనిపించింది. కానీ ఉన్నట్లుండి టాలీవుడ్లో మళ్లీ కదలిక వచ్చింది. వరుసబెట్టి కొత్త సినిమాల్ని ఓటీటీల్లోకి వదిలేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే అక్టోబరు 2న ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆహాలో విడుదల కాబోతున్నట్లు ప్రకటన రాగా.. అదే ఓటీటీలో ‘కలర్ ఫొటో’ రిలీజ్ కూడా కన్ఫమ్ అయింది. ఆ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 23న రాబోతోంది.

మరోవైపు అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ను కూడా అక్టోబరు 2నే రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు చిత్ర బృందం మీడియాకు లీకులు కూడా ఇచ్చేసింది. నెల రోజుల్లో మూడు తెలుగులో సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కావడం, అందవులో రెండు ఒకే రోజు రాబోతుండటం విశేషమే.

మరోవైపు సోలో బ్రతుకే సో బెటర్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, దటీజ్ మహాలక్ష్మి లాంటి సినిమాల్ని కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ మూడు కూడా అక్టోబరు, నవంబరు నెలల్లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి థియేటర్లలో కొత్త సినిమాలను మిస్ అవుతున్న తెలుగు ప్రేక్షకులకు వచ్చే రెండు నెలల్లో ఓటీటీ విందు ఘనంగానే ఉండేలా ఉంది.

This post was last modified on September 16, 2020 10:53 am

Share

Recent Posts

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

5 minutes ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

11 minutes ago

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

1 hour ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

3 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago