విడుదల తేదీ ఖరారు కాకపోయినా అక్టోబర్ రావడం పక్కాని తేలిపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. మొన్నటిదాకా కూతురి పెళ్లిలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఫ్రీ అయిపోవడంతో అతి త్వరలో రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారు. ఇటీవలే వచ్చిన జరగండి జరగండి లిరికల్ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో తరువాత ప్రమోషనల్ కంటెంట్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేయబోతున్నారు. ముఖ్యంగా టీజర్ చూశాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. కాకపోతే ఇంకో రెండు నెలలు ఎదురు చూడాలి.
ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ లో మెయిన్ హీరోయిన్ గా అందరూ కియారా అద్వానీనే చూస్తున్నారు. ఏదో ఊరికే ఆడిపాడటం లాగా కాకుండా లీకైన గెటప్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యం ఉన్నట్టుగానే అనిపించింది. చరణ్ తో పాటు ఐఎఎస్ చదివిన ఆఫీసర్ గా మంచి లెన్త్ దొరికినట్టు ఉంది. అయితే అసలు ఛాలెంజ్ ఇందులో అంజలికి ఉన్నట్టు యూనిట్ టాక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద రామ్ చరణ్ భార్యగా ఎవరూ ఊహించని తరహాలో శంకర్ ఆమె పాత్రను డిజైన్ చేశారట. కమల్ హాసన్ భారతీయుడులో సుకన్య తరహాలో యాక్టింగ్, మేకప్ రెండూ చాలా క్లిష్టం అనిపించేలా ప్రెజెంట్ చేశారట.
ఈ లెక్కన ఎవరూ ఊహించని సర్ప్రైజ్ అంజలినే కాబోతోంది. తనకో పాట కూడా ఉంటుంది కానీ డ్యూయెట్ తరహాలో కాకుండా ఎమోషనల్ గా, దేశభక్తిని మిళితం చేస్తూ తమన్ కంపోజ్ చేశాడని తెలిసింది. ఇటీవలే తన యాభై సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది ఫలితంతో నిరాశ చెందిన అంజలికి గేమ్ ఛేంజర్ సక్సెస్ చాలా కీలకం కానుంది. ప్రస్తుతానికి అవకాశాలకు లోటు లేకపోయినా ఇది బ్లాక్ బస్టర్ అయితే గ్రాఫ్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీనికన్నా ముందు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలోనూ పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రనే దక్కించుకున్న అంజలి దేంతో బ్రేక్ దక్కుతుందో చూడాలి.
This post was last modified on April 21, 2024 10:21 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…