‘టిల్లు స్క్వేర్’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను చూసి షాకవ్వని వాళ్లు లేరు. పదేళ్ల కెరీర్లో ఎన్నడూ ఆమె ఇంత హాట్ హాట్‌గా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ముందు ట్రెడిషనల్ ముద్ర వేయించుకున్న వాళ్లు తర్వాత కొంచెం గ్లామరస్‌గా కనిపించడం మామూలే కానీ.. మరీ అనుపమ లాంటి ఇమేజ్ ఉన్న వాళ్లు ఒక సినిమాలో లెక్క పెట్టుకోలేనన్ని లిప్ లాక్స్ చేయడం.. క్లీవేజ్ షోలు చేయడం.. ఇంటిమేట్ సీన్లలో నటించడం పెద్ద షాకే.
ఈ విషయంలో కొందరు ఫ్యాన్స్ హర్టయ్యారు కూడా. కానీ ఎప్పుడూ ఒక మూసలో కొట్టుకుపోవడం ఇష్టం లేని అనుపమ.. తన ఇమేజ్‌ను ఈ సినిమాతో పూర్తిగా మార్చేసుకుంది. ‘టిల్లు స్క్వేర్’ పెద్ద హిట్టవడంతో అనుపమ కెరీర్‌కు మంచి ఊపు వస్తుందనే భావిస్తున్నారు. కానీ అనుపమ ఇప్పటిదాకా కొత్త సినిమాలైతే ఏవీ ఓకే చేసినట్లు కనిపించడం లేదు.
‘టిల్లు స్క్వేర్’ తర్వాత అనుపమ ఇమేజ్ మారిపోవడంతో ఆమెకు వరుసగా బోల్డ్ క్యారెక్టర్ల ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్‌తో అనుపమ పారితోషకం కూడా పెరిగిపోగా.. ఇదే రేంజిలో అందాలు ఆరబోస్తూ ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్స్ చేస్తే ఎంతైనా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట. కానీ తనకు వస్తున్న బోల్డ్ క్యారెక్టర్ల ఆఫర్లు ఒప్పుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో అనుపమ ఉందట.
‘టిల్లు స్క్వేర్’లో తన పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి, తాను బోల్డ్‌గా నటించడం సినిమాకు ప్లస్ అవుతుంది కాబట్టి అలా నటించింది కానీ.. ప్రతిసారీ ఇలాగే కనిపించాలని అనుపమ భావించట్లేదట. పూర్తిగా ఇమేజ్ మేకోవర్ అవసరం లేదని.. ముందులా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తూనే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్రలు చేయాలని.. అందుకే ఆచితూచి సినిమాలు ఎంచుకోవాలని వెయిట్ చేస్తోందట అనుపమ.
This post was last modified on April 20, 2024 1:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…