ఒకప్పుడు ఉత్తరాది దర్శకులు, హీరోలంటే బాలీవుడ్ లో అంత ఉన్నత భావం ఉండేది కాదు. సాక్ష్యాత్తు చిరంజీవే ఓ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఫిలిం ఫెస్టివల్ కు వెళ్ళినప్పుడు మన లెజెండ్స్ ఫోటోలు లేకపోవడం చూసి బాధపడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడదంతా గతం. ముఖేష్ అంబానీ కొడుకు వేడుకలో ముగ్గురు ఖాన్లు కలిసి స్టేజి మీద డాన్సు చేయడానికి ఆస్కార్ సాధించిన తెలుగు పాట నాటు నాటునే కావాల్సి వచ్చింది. రాజమౌళి మీదున్న అక్కసు వర్తమానంలో తగ్గింది కానీ గతంలో ఎక్కువే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పదే పదే లక్ష్యంగా మారుతున్నాడు.
అసలు విషయమేంటో చూద్దాం. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజీ డీన్ గా నటించిన వ్యక్తి ఆదిల్ హుసేన్. తక్కువ సీన్లు ఉంటాయి. ఇటీవలే జరిగిన ఒక రేడియో టాక్ షోలో మాట్లాడుతూ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని, షూటింగ్ కు వెళ్లకుండా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే అదీ ఇచ్చారని, అందువల్ల చేయక తప్పలేదని అన్నాడు. అక్కడితో ఆగకుండా తెరమీద కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని కాస్త మోతాదు మించే ఓవరాక్షన్ చేశాడు. నిజానికి ఆయన క్యారెక్టర్ లెన్త్ కి ఇంత అవసరం లేదు.
దానికి సందీప్ వంగా ఘాటుగా బదులిస్తూ 30 ఆర్ట్ సినిమాలు తీసుకురాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు బాధ పడటంలో తప్పు లేదని, నటన పట్ల ప్యాషన్ కన్నా దురాశే కనిపిస్తోందని చురకలు వేశాడు. ఇప్పటికైనా మించిపోలేదని ఏఐ టెక్నాలజీ వాడి నీ మొహాన్ని మారుస్తానని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పుడే కాదు కబీర్ సింగ్ రిలీజైన టైంలోనూ కొందరు హిందీ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇచ్చి నెగటివ్ రివ్యూలు రాశారు. ఆడియన్స్ మద్దతుతో అది మూడు వందల కోట్లు సాధించింది. యానిమల్ మీద ఎన్ని డిబేట్లు జరిగాయో చూశాం. అయినా సందీప్ వంగా పట్ల ఇదేం ఏడుపో.
This post was last modified on April 18, 2024 3:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…