Movie News

మౌనవ్రతం పాటించనున్న ది రాజా సాబ్

ప్రభాస్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో ది రాజా సాబ్ మీద అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. యాక్షన్ వయొలెన్స్ కి దూరంగా ఒకనాటి వింటేజ్ డార్లింగ్ ని ఇందులో చూడబోతున్నామనే ఉత్సుకత వాళ్లలో విపరీతంగా ఉంది. దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా చేతికి బాహుబలి దొరికాడు కాబట్టి ఖచ్చితంగా ఓ రేంజ్ లో చూపిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఇవాళ మిరాయ్ టైటిల్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ రాజా సాబ్ అప్ డేట్స్ గురించి ఓపెనయ్యారు.

కల్కి 2898 ఏడి రిలీజయ్యాకే ది రాజా సాబ్ కు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెడతామని చెప్పారు. ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు అదే హీరో ఇంకో సినిమా గురించి ప్రచారం చేయడం పలురకాలుగా ఇబ్బంది పెడుతుంది. అందుకే కల్కి కోసం రాజా సాబ్ బృందం వెయిట్ చేస్తోంది. అలా అని షూటింగ్ అయిపోలేదు కానీ సగానికి పైగానే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తాతగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న రాజా సాబ్ కు తమన్ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సో కొంత కాలం వెయిట్ చేయాలి.

ది రాజా సాబ్ ఎప్పుడు రావొచ్చనే ప్రశ్నను విశ్లేషణ చేసుకుంటే ఈ ఏడాది ఉండదు. డిసెంబర్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే క్రిస్మస్ ని లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ తో పాటు అదే ప్లానింగ్ లో ఉన్న నాగచైతన్య తండేల్ ఆలోచనలో పడతాయి. ఒకవేళ సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకుకున్నా ప్రభాస్ ప్రాణ స్నేహితుల బ్యానర్ నుంచి చిరంజీవి విశ్వంభర వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లాష్ అయ్యే సమస్యే ఉండదు. ప్రభాస్, చిరులు ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప. ఈ లెక్కన ది రాజా సాబ్ వచ్చే ఏడాది మార్చి నుంచి వేసవి సెలవుల మధ్యలో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవడం ఖాయం.

This post was last modified on April 18, 2024 3:42 pm

Share

Recent Posts

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

6 minutes ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

7 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

7 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

8 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

8 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

9 hours ago