మొన్న సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నా ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోవడంలో విఫలమైన గుంటూరు కారం బుల్లితెరపై మాత్రం అదరగొట్టింది. ఇటీవలే శాటిలైట్ ఛానల్ లో జరిగిన ప్రీమియర్ కు ఏకంగా 9.23 టిఆర్పి సాధించడం చూసి టీవీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అర్బన్ రూరల్ కలిపి 8.31 రావడం విశేషం. గత కొంతకాలంగా టీవీలో ప్రసారమయ్యే కొత్త సినిమాలకు అంతగా ఆదరణ ఉండటం లేదు. ఓటిటిలో త్వరగా వచ్చేయడం, ఆడియన్స్ ముందే చూసేయడం వల్ల ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదన్నది వాస్తవం.
పెద్ద హిట్టు అనిపించుకున్న వాల్తేరు వీరయ్య ఇదే ఛానల్ లో కేవలం 5.14కి పరిమితం కాగా హాయ్ నాన్న, దసరాలు అయిదు దాటలేకపోయాయి. గాడ్ ఫాదర్ 7 దాటగా, జైలర్ ఆరున్నర దగ్గర ఆగిపొయింధి. వీరసింహారెడ్డి ఎనిమిది దాకా వెళ్ళింది. సర్ ఆరు లోపే ఆగిపోగా లియో మరీ అన్యాయంగా 3 దగ్గర బ్రేక్ వేసుకుంది. ఇవన్నీ గుంటూరు కారం కంటే మెరుగైన టాక్, వసూళ్లు తెచ్చుకున్నవి. కానీ మహేష్ బాబు స్టామినా స్మాల్ స్క్రీన్ పై కూడా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ. ఇప్పటికీ సరిలేరు నీకెవ్వరు 23.5 టిఆర్పితో రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ అల వైకుంఠపురములో (29.4).
ఈ టాక్ తోనే గుంటూరు కారం ఇంత స్పందన తెచ్చుకుంటే ఒకవేళ ఇండస్ట్రీ హిట్ అయ్యుంటే మాత్రం ఏ స్థాయిలో టిఆర్పి నమోదు చేసేదో. ఫిబ్రవరిలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటిలో వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ థియేటర్ రన్ త్వరగానే ముగించినప్పటికీ వారాల తరబడి డిజిటల్ ట్రెండింగ్ లో టాప్ ఫైవ్ ల ఉంది. టేకింగ్ పరంగా త్రివిక్రమ్స్ శ్రీనివాస్ నిరాశపరిచినప్పటికీ మహేష్ బాబు ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, కుర్చీ మడతపెట్టి పాట రిపీట్ వేల్యూని తీసుకొచ్చాయి. ఎడారిలో వర్షంలాగా డ్రైగా ఉన్న శాటిలైట్ మార్కెట్ కి గుంటూరు కారం రెస్పాన్స్ ఒకరకంగా ఊపిరిచ్చిందని చెప్పాలి.
This post was last modified on April 18, 2024 6:28 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…