భారతీయ సినిమా ప్యాన్ ఇండియాని మించి ప్రతి విషయంలో ముందడుగు వేసేందుకు పరుగులు పెడుతోంది. కలగా మిగిలిపోయిన ఆస్కార్ ని సాధించాం. ఓవర్సీస్ లో హాలీవుడ్ మూవీస్ కి ధీటుగా ఆడే బ్లాక్ బస్టర్లను తీస్తున్నాం. ఇంకా ఎదిగేందుకు ఏమేం అవకాశాలు ఉన్నాయో దేన్నీ వదిలి పెట్టడం లేదు. ఇప్పుడో కొత్త మైలురాయి దక్కింది. ఇప్పటిదాకా మనం స్క్రీన్ మీద చూస్తున్న అత్యున్నత సాంకేతిక 4K రెజోల్యూషన్. అందుబాటులో 8K ఉంది కానీ మన దేశంలో ఐమాక్స్ తో సహా మెజారిటీ థియేటర్లన్నీ ఫోర్ కెతో నడుస్తున్నవే. ఈ టెక్నాలజీని టీవీలు కూడా వాడుతున్నాయి.
అలాంటిది 12K రిజొల్యూషన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలమా. అది కూడా ఒక పాత సినిమాకి. చెన్నైకు చెందిన ప్రసాద్ కార్పొరేషన్ సంస్థ దాన్ని సాధ్యం చేసింది. 2000 సంవత్సరంలో రిలీజైన కమల్ హాసన్ హే రామ్ ని అప్ గ్రేడ్ చేసి భవిష్యత్తు తరాల కోసం సరికొత్త ప్రింట్ ని సిద్ధం చేసి ఉంచింది. అంటే తెరమీద ప్రతి ఒక్క డీటెయిల్ స్పష్టమైన నాణ్యతతో ఎన్ని వందల ఇంచుల స్క్రీన్ అయినా సరే ఏ మాత్రం చెక్కుచెదరకుండా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే నిజంగానే ఇది ఇరవై సంవత్సరాల క్రితం తీసిన సినిమానేనా అని అనుమానం వచ్చేంత గొప్పగా ఉంటుంది.
కొన్నేళ్ల క్రితమే హే రామ్ ని 4Kకి మార్చి తమిళనాడులో రీ రిలీజ్ చేశారు. దురదృష్టవశాత్తు తెలుగులో మాత్రం ఈ సినిమా ఎందుకో అందుబాటులో లేకుండా పోయింది. మూవీ లవర్స్ మాత్రం కనీసం ఇప్పటికైనా డబ్బింగ్ వెర్షన్ ని అందివ్వమని కోరుతున్నారు. హే రామ్ వివాదాస్పద గాంధీ మరణం చుట్టూ తిరిగే కథతో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించగా ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. మూడున్నర గంటల నిడివి ఉన్నా అద్భుతమైన నెరేషన్ తో కట్టి పారేస్తుంది. ఒరిజినల్ వెర్షన్ అఫీషియల్ గానే యూట్యూబ్ లో చూడొచ్చు.
This post was last modified on April 17, 2024 10:06 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…