Movie News

అంచనాలకు మించి భన్వర్ సింగ్ షెకావత్

టాలీవుడ్ కు పుష్పతో పరిచయమైన ఫహద్ ఫాసిల్ ఆ తరువాత ఓటిటిలో బోలెడు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా నున్నని గుండుతో, బయటికి కనిపించని క్రూరత్వాన్ని కళ్ళతోనే పలికించే పాత్రలో ఎంతగా మెప్పించాడో మళ్ళీ చెప్పనక్కర్లేదు. పార్టీ లేదా పుష్ప అంటూ ఫహద్ చెప్పే డైలాగ్ ఒక మీమ్ కంటెంట్ గా మారిపోయింది. అయితే పుష్ప 1లో తన క్యారెక్టర్ ని కేవలం గంటలోపు నిడివికే పరిమితం చేశాడు సుకుమార్. కథ ప్రకారం లేట్ ఎంట్రీ అయినా ఉనికిని చాటుకోవడంలో ఫహద్ సక్సెసయ్యాడు.

మరి పుష్ప 2 ది రూల్ లో ఎంత లెన్త్ ఉంటాడనేది అభిమానుల్లో పెద్ద సస్పెన్స్ గా మారింది. అంతర్గత సమాచారం మేరకు ఈసారి భన్వర్ సింగ్ షెకావత్ అసలు రూపం చూడబోతున్నామట. పుష్పరాజ్ చేతిలో భంగపడ్డ అనసూయ, సునీల్, ధనుంజయ్ లు ఒక ముఠాగా ఏర్పడి తోడుగా జగపతిబాబుని తెచ్చుకుంటారు. వీళ్ళను సమన్వయపరుస్తూ స్మగ్లింగ్ మాఫియాను వెనుక నుండి నడిపిస్తునే పగతో రగిలిపోతున్న భన్వర్ అవకాశం దొరికినప్పుడంతా పుష్పని దెబ్బ కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ క్లాష్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కీలకం కాబోతున్నాయి.

సో అంచనాలకు మించే పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉంటుందని టాక్. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి బిజినెస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. దానికి తోడు ఫహద్ ఫాసిల్ మార్కెట్ ఇటీవలి బ్లాక్ బస్టర్ ఆవేశంతో మరింత ఎగబాకింది. దీంతోష్ సహజంగానే బన్నీతో తన కాంబో మీద హైప్ మాములుగా ఉండదు. దర్శకుడు సుకుమార్ షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేసినట్టు తెలిసింది. పుష్ప 3 ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ ఫహద్ ఫాసిల్ పోషిస్తున్న క్యారెక్టర్ మాత్రం ఈ సెకండ్ పార్ట్ వరకే పరిమితమని అంటున్నారు. తన పాత్ర మీద ప్రత్యేక టీజర్ వస్తుందట.

This post was last modified on April 16, 2024 5:48 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago