సలార్‌ను మించిన కల్కి

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అయినా అతడి మార్కెట్ ఏమీ పడిపోలేదు. క్రేజ్ చెక్కు చెదరలేదు. ‘సలార్’ మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ సినిమా బిజినెస్ కూడా పతాక స్థాయిని అందుకుంది. ‘బాహుబలి’ని మించి బిజినెస్ ఆఫర్లు దక్కించుకుంది ఈ చిత్రం. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.165 కోట్ల దాకా అమ్ముడైతే అంత పెద్ద మొత్తాన్ని కూడా రికవర్ చేసి లాభాలు కూడా అందించిందీ చిత్రం.

ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి’ దీన్ని మించి బిజినెస్ చేస్తోందన్నది తాజా సమాచారం. ‘కల్కి’ తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏకంగా రూ.190 కోట్ల మార్కును టచ్ చేసిందట. అన్ని ఏరియాలకూ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.

‘కల్కి’ నైజాం ఏరియా హక్కులు రూ.75 కోట్లు పలకగా.. సీడెడ్ రైట్స్ రూ.30 కోట్లు తెచ్చిపెట్టాయట. ఆంధ్రా ప్రాంతానికి రూ.80-90 మధ్య డిస్కషన్లు నడుస్తున్నాయి. మొత్తంగా ‘కల్కి’ తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.190 కోట్లు దాటిపోతోంది. ‘కల్కి’ ఇండియన ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం. అందుకు తగ్గట్లే దీని హైప్ మామూలుగా లేదు. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్ ఈ మూవీ.

ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైంకి సినిమాను రెడీ చేయడం కష్టమే. పైగా అది ఎన్నికల టైం. అందుకే సినిమాను కనీసం నెల రోజులు వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.