మొదటి రోజు వచ్చిన పబ్లిక్ టాక్, రివ్యూల పట్ల అపనమ్మకం వ్యక్తం చేస్తూ నిర్మాత దిల్ రాజు స్వయంగా థియేటర్లకు వెళ్లి మరీ తన సినిమా బాగుందని చెప్పించిన ది ఫ్యామిలీ స్టార్ చివరాఖరికి డిజాస్టర్ బారి నుంచి తప్పించుకోలేకపోయింది. మొదటి వీకెండ్, ఉగాది పండగ, రంజాన్ సెలవులు, రెండో వారాంతం ఇవేవి ఉపయోగ పడకపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. సెలవుల్లో ఆప్షన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం కుటుంబ ప్రేక్షకులైనా ఈ సినిమా చూస్తారనుకుంటే అదీ జరగలేదు. ట్రేడ్ టాక్ ప్రకారం రాబడి, ఖర్చులు అన్నీ రానూపోనూ లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం ఖాయమట.
ఇది అఫ్ ది రికార్డు చెబుతున్న మాటే కాబట్టి అంతకన్నా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదు. పరిస్థితి అర్థమైపోవడంతో దిల్ రాజు రిలీజైన నాలుగో రోజు నుంచే సైలెంట్ అయ్యారు. కృత్రిమంగా ప్రమోషన్లు చేయడం, హడావుడి చేసి హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటివి చేయలేదు. పికప్ అయ్యే సూచనలు ఏ మాత్రం ఉన్నా పబ్లిసిటీ జరిగేదేమో కానీ సాధ్యపడలేదు. శ్రీరామనవమితో పాటు ఇంకో లాంగ్ వీకెండ్ వస్తున్నా ఎగ్జిబిటర్లు ఏ మాత్రం నమ్మకంతో లేరు. దీనికన్నా టిల్లు స్క్వేర్ వసూళ్లు మెరుగ్గా ఉండటం గాయం మీద కారం చల్లిన వ్యవహారంలా అయ్యింది.
సో ది ఫ్యామిలీ స్టార్ ఫైనల్ రన్ కు దగ్గరపడినట్టే. అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి ప్రీమియర్ కూడా అనుకున్న ముందే జరగొచ్చని టాక్. నాలుగు వారాల ఒప్పందం ప్రకారం మే 3 రావాలి. అలా కాకుండా ఇంకో వారం అడ్వాన్స్ గా వచ్చేస్తే ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ప్రైమ్ ప్రతిపాదనకు దిల్ రాజు అంగీకరించారని వినికిడి. ఈ మధ్య డిజిటల్ రిలీజులు హఠాత్తుగా జరిగిపోతున్నాయి కాబట్టి ఏది నిజమో ఏది అబద్దమో ఖరారుగా చెప్పలేని పరిస్థితి. ఖుషి కంటే మెరుగ్గా ది ఫ్యామిలీ స్టార్ ఆడుతుందనుకుంటే ఓపెనింగ్స్ పరంగా లైగరే నయమనిపించుకోవడం ఊహించని ట్రాజెడీ.
This post was last modified on April 16, 2024 11:29 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…