గత ఏడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల టైంలో పెద్దగా అంచనాలేం లేవు. తమిళ వెర్షన్ ఏమో కానీ తెలుగు డబ్బింగ్ హక్కులను తక్కువకు విక్రయించి రికవరీ అయితే చాలు అదే గొప్పనుకున్న మాట అబద్దం కాదు. కట్ చేస్తే అంచనాలకు మించి ఆడి బ్లాక్ బస్టర్ సాధించి నలభై కోట్లకు పైగా ఏపీ, తెలంగాణకు కలిపి వసూలు చేయడం అనూహ్యం. అందుకే సీక్వెల్ మీద ఎక్కడ లేని హైప్ ఉంది. లాల్ సలామ్ ఘోరమైన డిజాస్టర్ అయినా సరే కేవలం రజని ఒక్కడే దానికి బాద్యుడు కాదు కాబట్టి మార్కెట్ మీద అంత ప్రభావం ఉండేలా లేదు. కానీ జైలర్ బ్రాండ్, కథా కమామీషు వేరే.
తాజా అప్డేట్ ప్రకారం జైలర్ 2 టైటిల్ మారబోతోంది. సినిమాలోని బాగా పాపులర్ అయిన హుకుమ్ పదాన్ని పేరుగా నిర్ణయించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి తలైవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ప్రస్తుతం డ్రాఫ్ట్ సిద్ధం చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజని చెప్పిన కొన్ని కీలక మార్పుల మీద వర్క్ చేస్తున్నాడు. అవి ఓకే కాగానే జూన్ నుంచే షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నాడు. ఈసారి సన్ పిక్చర్స్ బడ్జెట్ ని పెద్ద ఎత్తున పెంచబోతోంది. లొకేషన్లు, క్యాస్టింగ్ వేరే లెవెల్ లో అత్యంత భారీగా ఉంటాయట.
జైలర్ మొదటి భాగంలో కొడుకు, మెయిన్ విలన్ చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త పాత్రల మీద ప్రత్యేక కసరత్తు జరుగిందట. శివరాజ్ కుమార్ పోషించిన నరసింహ పాత్రను పొడిగించి, మోహన్ లాల్ ని కొంత మేర వాడుకునేలా ప్లాన్ చేసినట్టు వినికిడి. హీరోయిన్ అవసరం లేదు కాబట్టి వయసు మళ్ళిన ముత్తువేల్ పాండియన్ విగ్రహాల దొంగలను కాకుండా ఈసారి మెడికల్ మాఫియా పని పట్టేలా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ సెట్ చేశారట. అనిరుద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ తో రజని 171 రిలీజ్ అయ్యాకే హుకుమ్ ని విడుదల చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on April 12, 2024 10:55 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…