Movie News

కల్కి 2898 ఏడి విడుదలకు రెండు ఆప్షన్లు

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే వారం ఏప్రిల్ 17 డేట్ ని ప్రకటించబోతున్నట్టు చెబుతున్నారు కానీ అంతర్గత సమాచారం ప్రకారం రెండు ఆప్షన్లు పెట్టుకుని వాటి మీద చర్చలు జరుపుతున్నారట. వాటిలో మొదటిది మే 30. డిస్ట్రిబ్యూటర్లు తొలుత దీనికి సానుకూలంగా ఉన్నప్పటికీ దానికన్నా మెరుగైన ప్రత్యాన్మయం చూడమంటే జూన్ 20 గురించి అనాలిసిస్ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి. ఇవి కాకుండా వేరేదయ్యే ఛాన్స్ లేదు.

మెజారిటీ శాతం జూన్ 20 వైపే మొగ్గు చూపొచ్చని వినిపిస్తోంది. ఆ రోజు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి రిలీజులు లేవు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇబ్బందిగా మారే హాలీవుడ్ మూవీస్ ఏవీ షెడ్యూల్ కాలేదు. అప్పటికప్పుడు వచ్చే సీన్ కూడా ఉండదు. సో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది. పోటీని పట్టించుకోకుండా వెళ్లడం వల్లే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు ఆక్వామెన్ 2 ఫాలెన్ కింగ్ డం నుంచి వచ్చిన అడ్డంకి చిన్నది కాదు. అది ఫ్లాప్ అయ్యింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ప్రభాస్ సినిమా వసూళ్లకు ఇంకా గండి పడేది.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే కల్కి 2898 డేట్ ఫిక్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ఇవాళో రేపో గుమ్మడికాయ కొట్టడం ఖాయమని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. షూట్ జరిగిన భాగానికి విఎఫ్ఎక్స్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిదీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో కమల్ హాసన్ అతిథిగా నటించానని చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా స్పెషల్ గా ఉంటుందట. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ అంచనాలున్నాయి.

This post was last modified on April 10, 2024 6:48 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

32 minutes ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago