Mathias Boe, Taapsee Pannu. Photo: Instagram
టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్లో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక తాప్సి పన్ను. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తాప్సి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన టైంలో డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడడం.. చాలా ఏళ్ల పాటు వాళ్ల రిలేషన్‌షిప్ కొనసాగడం తెలిసిన విషయమే.
ఈ మధ్యే వీళ్లిద్దరూ గత నెల 23న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పెళ్లికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. నిజంగా వీరి పెళ్లయిందా అనే సందేహాలు కలిగాయి. ఐతే ఇప్పుడు తాప్సినే స్వయంగా మథియాస్‌తో తన పెళ్లి జరిగిన విషయాన్ని ధ్రువీకరించింది. కానీ తమ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.
“మా పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి రేకెత్తించాలని నాకు లేదు. దాని గురించి అందరూ మాట్లాడుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఈ విషయాన్ని బహిర్గత పరచలేదు. అది నా అభిప్రాయం. నా భర్తకు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు. మీడియాకు, సోషల్ మీడియాకు నా పెళ్లి గురించి చెప్పాలని అనుకోలేదు. పెళ్లి విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనేమీ అనుకోలేదు. నేను నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకున్నా. వాళ్లకు ముందు నుంచి అంతా తెలుసు. వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అనేది ప్రత్యేకమైన విషయం. జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. అందుకే సన్నిహితుల మధ్య ఆనందంగా ఆ వేడుక జరుపుకున్నాం. కేవలం మీడియాకు మాత్రం దూరంగా ఉన్నాం. ప్రస్తుతానికి మా పెళ్లి ఫొటోలు, వీడియోలు అందరికీ చూపించే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో నా ఆలోచన మారితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తా” అని తాప్సి పేర్కొంది.
This post was last modified on April 10, 2024 3:13 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…