నిన్న టిల్లు స్క్వేర్ డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన జోష్ మాములుగా లేదు. సాయంత్రం దాకా సోషల్ మీడియాలో వేర్వేరు టాపిక్స్ మీద ఉన్న ట్రెండింగ్ ఒక్కసారిగా తారక్ స్పీచ్ వైపు వచ్చేసింది. దేవరకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ మీద కురిపించిన ప్రశంసలు, సినిమా గురించి పొగిడిన విధానం, టీమ్ మీద ప్రశంసలు గుప్పించిన వైనం ఆకట్టుకునేలా సాగాయి.
అన్నింటి కంటే హైలైట్ పవన్ కళ్యాణ్ అత్తారింటిది దారేదిలో డైలాగుని వాడి స్టేజి మీద త్రివిక్రమ్ ని సంబోధించడం. “కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేకాని నేనున్నాను గుర్తించండి ఇక్కడ మీరు” అంటూ సరదాగా పలకడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా బ్రహ్మానందం స్టైల్ లో ఐ యాం టెల్లింగ్ థట్ అంటూ ఇంకో పంచ్ వేసి పోలా అదిరిపోలా అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ వెంటనే దగ్గరికి వచ్చేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ హుషారు ప్రతి మాటలో వినిపించింది. ఏదో వచ్చా నాలుగు మాటలు చెప్పేసి వెళదామనే తరహాలో కాకుండా ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగేలా చేయడంతో వీడియోలు వైరలయ్యాయి. ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయాక టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో ఒక్కసారిగా ఊపు రావడంతో ప్రమోషన్లలో మళ్ళీ వేగం పెంచారు. ఈవెంట్ చేయడం కూడా అందులో భాగమే. పది రోజులకే 100 కోట్ల గ్రాస్ దాటేయడంతో సంక్రాంతికి వచ్చిన హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ సినిమానే.
This post was last modified on April 9, 2024 3:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…