తమిళ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ తనయురాలు ఐశ్వర్య రెండేళ్ల కిందటే విడిపోతున్నట్లు ప్రకటించచడం తెలిసిన సంగతి తెలిసిందే. ఐతే వీళ్లిద్దరూ విడివిడిగా ఈ ప్రకటన చేశాక.. అధికారికంగా విడిపోయారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి ఇరు కుటుంబాల పెద్దలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు.. దీంతో విడాకుల వ్యవహారం హోల్డ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలా అని ధనుష్, ఐశ్వర్య ఎక్కడా కూడా మళ్లీ కలిసి కనిపించలేదు.
ఐతే ఇప్పుడు ఈ జంట అధికారికంగా విడిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. తమకు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నై కోర్టులో ధనుష్, ఐశ్వర్య జంట పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి అంగీకారంతో ఈ జంట విడిపోవడానికి సిద్ధమైంది.
దర్శకుడు కస్తూరి రాజా తనయుడైన ధనుష్.. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన తుల్లువదో ఎలమై చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్లో ఎదుగుతున్న దశలో అతను ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు. ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దది. తన అక్క క్లాస్ మేట్ కావడంతో అలా పరిచయం జరిగి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ధనుష్ అల్లుడు అయ్యాక ధనుష్ రేంజే మారిపోయింది. అద్భుతమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా అవతరించాడు.
ధనుష్, ఐశ్వర్యలకు యుక్త వయసులో ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు సాగిన వివాహ బంధానికి తెరదించాలని 2022లో ఈ జంట నిర్ణయించుకుంది. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ ప్రకటన వచ్చిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జంట కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates