మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ మొదలైన దగ్గర్నుంచి అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంది. మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి. హిందీ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ అయినప్పటికీ.. ఏ భాష నుంచి కథను తీసుకున్నా దాన్ని తనదైన శైలిలో మార్చి కొత్త లుక్ తీసుకురావడం హరీష్ శంకర్ శైలి.
గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో అదే మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’లోనూ ఆ మ్యాజిక్ రిపీటవుతుందని ఆశిస్తున్నారు. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. అందుక్కారణం.. ఈ సినిమా నుంచి జగపతిబాబు డెడ్లీ లుక్ ఒకటి రిలీజ్ చేయడమే. ఈ సినిమాలో ఆయనే మెయిన్ విలన్.
జగపతిని డిఫరెంట్ లుక్‌లో చూపిస్తూ వదిలిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని తపించే జగపతి కోరికను ఈ పాత్ర తీర్చినట్లే కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ జగపతిబాబు పెట్టిన కామెంట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘‘మిస్టర్ బచ్చన్‌లో మాస్ రాజాని ఏసేయడానికి సిద్ధం’’ అని ఆయన కామెంట్ పెట్టారు.
ఐతే దీనికి మాస్ రాజా కూడా ఆసక్తికర రీతిలో స్పందించాడు. ‘‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ. ఎవరు ఎవరిని ఏస్తారో చూస్కుందాం’’ అంటూ జగపతిని కోట్ చేశాడు రవితేజ. ఈ సరదా సంభాషణ సోషల్ మీడియా జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా షూట్ విషయానికి వస్తే.. 80 శాతం దాకా పూర్తయినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులై రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
This post was last modified on April 8, 2024 1:46 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…