డీజే టిల్లు టైంలో ఒక ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తన లక్ష్యం రాబోయే మూడేళ్ళలో వంద కోట్లు వసూలు చేసే సినిమా ఒకటి తన ఖాతాలో ఉండాలని చెప్పాడు. ఇమేజ్ ఉన్న టైర్ 2 స్టార్లకు సైతం సులభంగా అందని మైలురాయి ఆది. పదుల సంఖ్యలో హిట్లున్న కుర్ర హీరోలు చేరుకోలేని ఆ మార్కుని సిద్దు అంత తేలిగ్గా దక్కించుకోడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కట్ చేస్తే టిల్లు స్క్వేర్ దాన్ని సాధ్యం చేసి చూపించింది. పదో రోజు అడుగు పెట్టడం ఆలస్యం 101 కోట్ల గ్రాస్ ని సగర్వంగా దాటేసి విజయ దరహాసాన్ని కొనసాగించే దిశగా పరుగులు పెడుతోంది.
ఒక నెల రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. టిల్లు స్క్వేర్ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ పార్ట్ అంత మేజిక్ జరగదేమోననే అనుమానాలు తలెత్తాయి. పైగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ప్లస్ లిప్ లాక్ షో మీద రకరకాల ఆన్ లైన్ డిబేట్లు. ఆ అమ్మాయి వీటికి తట్టుకోలేక ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేకపోవడం, పాటలు డీజే టిల్లు రేంజ్ లో రీచ్ కాకపోవడం ఇలా రకరకాల కారణాలు బజ్ మీద ప్రభావం చూపించాయి. కట్ చేస్తే మార్చి 29 రిలీజైన టిల్లు స్క్వేర్ యూత్ కి అమాంతం ఎక్కేసింది.
అక్కడి నుంచి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ స్టార్ వచ్చాక విపరీతంగా నెమ్మదిస్తుందేమోనని ఫ్యాన్స్ భయపడితే అవి పటాపంచలు అయ్యాయి. విజయ్ దేవరకొండ కన్నా తొమ్మిదో రోజు సిద్దు జొన్నలగడ్డనే ఎక్కువ టికెట్లు అమ్మడం దానికి నిదర్శనం. ఇక్కడితో అయిపోలేదు. మంగళవారం ఉగాది సెలవు, ఒక్క రోజు గ్యాప్ లో రంజాన్ పండగ, తిరిగి మూడో వీకెండ్, ఆసక్తి రేపని కొత్త రిలీజులు ఇవన్నీ టిల్లు ప్రభంజనానికి సానుకూలంగా పని చేసేవే. ఈ లెక్కన 150 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాన్ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. దెబ్బలు టిల్లు క్యూబ్ హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో.
This post was last modified on April 7, 2024 12:40 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…