టాలీవుడ్లో కొన్నాళ్లుగా మలయాళ సినిమాల హవా నడుస్తోంది. గత నెలలో ప్రేమలు మూవీ ఎంత సందడి చేసిందో తెలిసిందే. భ్రమయుగం కూడా ఓ మోస్తురుగా ఆడింది. ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ హవా మొదలైంది. మలయాళంలో 200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రమిది. అక్కడ సినిమా రిలీజైన వారానికే తెలుగు డబ్బింగ్ కన్ఫమ్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయింది. ఈలోపే మన ప్రేక్షకులు మలయాళ వెర్షన్‌ను హైదరాబాద్ లాంటి సిటీల్లో ఎగబడి చూశారు.
ఇప్పుడిక తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాగా రెస్పాన్స్ అదిరిపోతోంది. ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీతో పోటీగా వస్తున్న నేపథ్యంలో ప్రేమలు మూవీలా ఇది మ్యాజిక్ చేయగలదా అన్న సందేహాలు కలిగాయి.
కానీ ఫ్యామిలీ స్టార్‌కు డివైడ్ టాక్ రావడం.. అదే సమయంలో మంజుమ్మల్ బాయ్స్‌కు టాక్ బాగుండడం, పబ్లిసిటీ కూడా బాగా చేయడంతో శనివారం ఉదయం మంచి ఆక్యుపెన్సీలతో షోలు మొదలయ్యాయి. టాక్ అంతకంతకూ పాజిటివ్ అవ్వగా.. అందుకు తగ్గట్లే వసూళ్లూ పెరిగాయి. సాయంత్రం, రాత్రి షోలకు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు.
బుక్ మై షోలో అన్ని షోలూ రెడ్ కలర్లోకి మారిపోయాయి. షోల టైం దగ్గర పడేసరికి ఫాస్ట్ ఫిల్లింగ్, సోల్డ్ ఔట్ మోడ్‌లోకి వచ్చేశాయి. హాళ్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా మంచి ఆక్యుపెన్సీలు ఉండడం విశేషం. ఓ డబ్బింగ్ మూవీకి ఇలాంటి స్పందన ఆశ్చర్యం కలిగించే విషయమే. చూస్తుంటే ఈ సినిమాను రిలీజ్ చేసిన మైత్రీ అధినేతలు భారీ లాభాలే అందుకునేలా ఉన్నారు.
This post was last modified on April 7, 2024 10:35 am
ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…
తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…
వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ…
భారీ అంచనాల మధ్య విడుదలైన ఎల్2 ఎంపురాన్ కు మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో డివైడ్ టాక్ వచ్చిన…
బాహుబలి, కెజిఎఫ్, పుష్ప సీక్వెల్స్ వస్తే వాటికి క్రేజ్ రావడం సహజం. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన…