తెలుగు ప్రేక్షకులకు భాషా భేదం అనేదే ఉండదు. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరిస్తారు. డబ్బింగ్ సినిమాలను మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నట్లు ఎవ్వరూ పెట్టుకోరు. ఈ మధ్య మనవాళ్లు మలయాళ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. గత నెలలో ‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాను సూపర్ హిట్ చేశారు.
మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ కూడా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సినిమా మంచి టాక్‌తో మొదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేలా కనిపిస్తోంది. ఐతే వీటి మధ్యలో ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’ అనే మరో మలయాళ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ట్రైలర్ చూస్తేనే ఇది గొప్ప సినిమా అనే సంకేతాలు కనిపించాయి. టాక్ కూడా అలాగే వచ్చింది. కానీ ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్దగా ప్రభావమే చూపలేదు.
‘ది గోట్ లైఫ్’ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపించాయి సినిమాలో. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టేశాడు. ఒక పాత్ర కోసం ఏ స్టార్ హీరో చేయని సాహసం చేశాడు. కానీ ఈ సినిమా మరీ నెమ్మదిగా సాగడం.. విపరీతమైన వేదనకు గురి చేసేలా ఉండడం.. నిడివి మరీ ఎక్కువ అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. మంచి సినిమా అంటూనే చూడలేం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కానీ మలయాళ ప్రేక్షకులు మాత్రం ‘ది గోట్ లైఫ్’ను నెత్తిన పెట్టుకున్నారు. పృథ్వీరాజ్ కష్టానికి గొప్ప ఫలితాన్ని అందించారు. రిలీజైన దగ్గర్నుంచి హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది ఈ చిత్రం. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ది గోట్ లైఫ్’ నిలవడం విశేషం. ఆర్ట్ సినిమాలా అనిపించే ఇలాంటి మూవీకి ఇంత మంచి కలెక్షన్ ఇచ్చి తమ అభిరుచిని చాటుకున్నారు మలయాళ ఆడియన్స్.
This post was last modified on April 7, 2024 12:51 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…