Movie News

అమ్మాయి గురక మీద సినిమా తీశారు

కాదేది క్రియేటివిటీకి అనర్హం. ఇది న్యూ జనరేషన్ ఫిలిం మేకర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన సూక్తి. అప్పుడే కొత్త కాన్సెప్ట్ లతో విభిన్న ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఆసియన్ సంస్థలు సంయుక్తంగా తెలుగులో తీసుకొస్తున్న డియర్ చూస్తే ఇదే అనిపిస్తుంది. జివి ప్రకాష్ కుమార్, ఐశ్యర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మాయి గురక. దాని చుట్టే లవ్ స్టోరీ, మ్యారేజ్, ఎమోషన్స్ అన్నీ పెట్టేశారు. సంగీతం స్వయంగా జివినే సమకూర్చుకున్న ఈ ఎంటర్ టైనర్ కు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు.

కథేంటో అరటిపండు వలిచినట్టు చెప్పేశారు. అబ్బాయి లైట్ స్లీపర్. అంటే రాత్రిళ్ళు ఎక్కువ నిద్ర పట్టదు. ఏదో రెండు మూడు గంటలు పడుకుని మమ అనిపిస్తాడు. అమ్మాయికేమో పెద్ద శబ్దాలతో గురక పెట్టి తొంగోవడం అలవాటు. ఈ ఇద్దరికీ దేవుడు ముడిపెడతాడు. తమ బలహీనతను దాచి పెట్టుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే మొదటి రాత్రి అసలు రహస్యం బయట పడుతుంది. సింహంలా గుర్రు సౌండ్ తో కాపురం చేసే పెళ్ళాన్ని భరించలేనంటూ కుర్రాడు వీధికెక్కుతాడు. వీళ్లకు తగ్గట్టే ఉన్న తల్లితండ్రులకు ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. అదేంటో ఏప్రిల్ 12 చూడాలి.

వెరైటీగా అనిపిస్తోంది కానీ ఇలాంటి వాటిలో వినోదం బాగా పండితేనే థియేట్రికల్ గా వర్కౌట్ అవుతాయి. ఆ మధ్య గుడ్ నైట్ అనే తమిళ మూవీ బాగా ఆడింది. ఓటిటిలో ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డియర్ అలాంటి స్పందనే దక్కించుకుంటుందా లేదానేది వేచి చూడాలి. క్యాస్టింగ్ మొత్తం అరవ నటీనటులే ఉన్నారు. పెద్ద బడ్జెట్ లేకుండా సింపుల్ గా లాగించిన డియర్ పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ మీద ఆధారపడి ఉంది. లీడ్ పెయిర్ లో ఒకరికి ఒక విచిత్రమైన జబ్బు ఉండటం దర్శకుడు మారుతీ ఏ క్షణంలో కనిపెట్టాడో కానీ సంవత్సరాల తర్వాత కూడా ఆ ఫార్ములా చెల్లుబాటవుతోంది.

This post was last modified on April 6, 2024 6:39 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago