Movie News

4 సినిమాలు 500 కోట్లు – పీక్స్ మల్లువుడ్

గత కొన్నేళ్లుగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా ఇస్తున్న మలయాళం పరిశ్రమ 2024 కొత్త సంవత్సరంలో దివ్యంగా వెళ్ళిపోతోంది. కేవలం నాలుగు సినిమాలతో అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ ని దాటించేసి అబ్బురపరుస్తోంది. వీటిలో ఏదీ విజువల్ గ్రాండియర్ కాదు. భారీ గ్రాఫిక్స్ వాడింది, దేశవివిదేశాలు చుట్టినవి లేదు. అయినా సరే ఈ ఫీట్ సాధించడం మాములు విషయం కాదు. ముందు నుంచి వెనుక వరస తీసుకుంటే ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇప్పటికే 230 కోట్లు దాటేసి టాప్ వన్ వైపు పరుగులు పెడుతోంది. తెలుగు వెర్షన్ ఫైనల్ రన్ కలిపితే మేజిక్ ఫిగర్ సాధ్యమేనని చెప్పొచ్చు.

దీనికన్నా ముందు వచ్చిన ‘ప్రేమలు’ 150 కోట్లను దాటుకుని చిన్న బడ్జెట్ లో పెద్ద అద్భుతంగా నిలిచింది. తెలుగులో విపరీతమైన పోటీ మధ్య వచ్చినా పద్దెనిమిది కోట్లు దాటడం మాటలు కాదు. ఇవి రెండు భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలు. పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్ ఆడు జీవితం’ విజయవంతంగా 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. ఇతర భాషల్లో స్లో నెరేషన్ వల్ల ఆడలేదు కానీ కేరళ వాసులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. మమ్ముట్టి ‘భ్రమయుగం’ సైతం ఇదే సీన్. టాలీవుడ్ లో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ కలెక్షన్ 60 కోట్లు దాటేసింది. ఇవన్నీ కలుపుకుంటే అర సహస్రం దాటేసింది.

ఈ సంవత్సరం ఏ భాషలోనూ కేవలం మూడు నెలల కాలంలో ఇన్ని బ్లాక్ బస్టర్లు లేవు. కౌంట్ పరంగా మన దగ్గర ఉన్నాయి కానీ బడ్జెట్ కోణంలో చూసుకుంటే ఎక్కువ ఖర్చు కాబట్టి పెట్టుబడి రాబడి లెక్కల్లో రెండో స్థానమని చెప్పొచ్చు. అలా కాకుండా కేవలం ఒక్క సినిమా పరిగణనలోకి తీసుకుంటే హనుమాన్ ఎవరికీ అందనంత దూరంలో నిలబడింది. టిల్లు స్క్వేర్ ఎంత దూకుడుగా ఉన్నా మహా అయితే నూటా ముప్పై నుంచి నూటా యాభై కోట్ల మధ్యలో ఆగిపోతుంది. దెబ్బకు మళయాలంలో క్రేజ్ ఉన్న కాంబోలు నిర్మాణంలో ఉన్నప్పుడే మన నిర్మాతలు డబ్బింగ్ ప్లస్ రీమేక్ హక్కుల కోసం కన్నేస్తున్నారు.

This post was last modified on April 6, 2024 6:30 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

5 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago