‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్లో ఇంకో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోతాయి. దీనికి తోడు నిర్మాతగా దిల్ రాజుకు ఉన్న బ్రాండ్ వాల్యూ సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా మొదలైనపుడు ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ముగ్గురి నుంచి ఆశించే సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఎంతమాత్రం కాదనే ఫీలింగ్ మెజారిటీ ప్రేక్షకుల్లో కలిగింది తొలి రోజు.
యుఎస్ ప్రిమియర్స్ నుంచే ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో అర్లీ మార్నింగ్ షోలతో కూడా టాక్ ఏమీ మారలేదు. సోషల్ మీడియాలో అయితే నెగెటివిటీ అంతకంతకూ పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో డిజాస్టర్ ఖాయం అనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
ఈ టాక్ ప్రకారం చూస్తే ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లు మధ్యాహ్నం నుంచే ఖాళీ అయిపోవాలి. ‘లైగర్’ లాంటి సినిమాలకు అదే జరిగింది. టాక్ పరంగా చూస్తే ‘లైగర్’కు, ‘ఫ్యామిలీ స్టార్’కు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. కానీ ఈ ప్రభావం థియేటర్ ఆక్యుపెన్సీల మీద పెద్దగా కనిపించకపోవడం ‘ఫ్యామిలీ స్టార్’ టీంకు ఊరటనిచ్చే విషయం. మార్నింగ్ షోలకు ఉన్న ఆక్యుపెన్సీలు చాలా థియేటర్లలో తర్వాతి షోలకు కూడా కొనసాగినట్లు బుకింగ్స్‌ను బట్టి అర్థమవుతోంది.
విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పని చేసిందా.. దిల్ రాజు బ్రాండ్ వాల్యూ వర్కవుట్ అయిందా.. లేక వేసవి సీజన్లో టాక్ ఎలా ఉన్నా కొత్త సినిమా చూడాల్సిందే అని ప్రేక్షకులు ఫిక్సయ్యారా అన్నది చెప్పలేం కానీ.. తొలి రోజు ఈవెనింగ్, నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీలు కనిపించడం కచ్చితంగా టీంకు పెద్ద రిలీఫ్. వీకెండ్ వరకు ఇదే జోష్ కొనసాగితే.. ‘ఫ్యామిలీ స్టార్’ కొంచెం సేఫ్ అవుతుంది. విజయ్‌కి మరో డిజాస్టర్ తప్పుతుంది.
This post was last modified on April 6, 2024 10:50 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…