సినిమా వాళ్లు సినిమా కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకోవడం కొత్తేమీ కాదు. కలిసి నటించిన వాళ్లు పెళ్లి చేసుకోవడమే కాదు.. ఒక సినీ కుటుంబం నుంచి అమ్మాయిని ఇంకో సినీ కుటుంబంలోని అబ్బాయికీ ఇస్తుంటారు. ఈ మధ్య అలాంటి సంబంధమే ఒకటి కుదిరినట్లు వార్తలు వచ్చాయి. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా.. మురళీ మోహన్ మనవరాలిని పెళ్లాడబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఐతే దీని గురించి ఇప్పటిదాకా ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించలేదు. కాగా ఇప్పుడు మురళీ మోహన్ కోడలు, వధువు తల్లి అయిన మాగంటి రూప ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మురళీ మోహన్‌తో కలిసి ఆమె ఆలీ నిర్వహించే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమానికి హాజరైంది.
ఈ సందర్భంగా మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరందట నిజమేనా అని ఆలీ అడిగాడు. దీనికి రూప బదులిస్తూ.. ‘‘అవును. నిజమే.. సంగీత దర్శకుడు కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీ సింహాతో మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు’’ అని వెల్లడించింది. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు.
‘మత్తువదలరా’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీతో శ్రీ సింహా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తర్వాత సింహా కెరీర్ గాడి తప్పింది. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. అతడి కొత్త సినిమా ఏదీ అనౌన్స్ కాలేదు.
This post was last modified on April 6, 2024 7:28 am
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…