టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు అంతగా వార్తల్లో ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. సోషల్ మీడియాలో కూడా తరచుగా ఆయన పేరు చర్చనీయాంశం అవుతుంటుంది. ఆయన స్టేజ్‌ల మీద మాట్లాడే మాటలు.. ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. తన భార్య అనిత చనిపోయిన కొన్నేళ్లకు రాజు.. తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవడం.. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టడం తెలిసిందే.
ఐతే లేటు వయసులో రాజు చేసుకున్న పెళ్లి మీద కూడా ట్రోలింగ్ తప్పలేదు. ముఖ్యంగా రాజు.. తేజస్వితో పరిచయం.. తర్వాత తమ పెళ్లి జరగడం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబితే.. దాని మీద కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. ఐతే ఈ ట్రోల్స్ అన్నింటినీ రాజు కూడా చూశారట. అవన్నీ తన భార్యే తనకు చూపిందని.. తనను ఈ ట్రోల్స్ పెద్దగా ప్రభావితం చేయవని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రాజు.
“నాకు గతంలో మీమ్స్, ట్రోల్స్ గురించి అవగాహన లేదు. నా పెళ్లి తర్వాత ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్యను ఎలా కలిసింది, మా జర్నీ ఎలా మొదలైంది వివరించాను. ఆ వీడియోపై ట్రోల్స్ చేశారు. అవి నా భార్య చూపించింది. నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ చేసే వాళ్ళు పదివేల మంది ఉంటారేమో. ఇలా ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. నేను ఆకాశం లాంటివాడిని. ట్రోల్స్ ఏమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవు కదా! ట్రోల్స్ మేఘాల్లాంటివి. అవి వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’’ అని దిల్ రాజు పేర్కొన్నాడు.
This post was last modified on April 5, 2024 5:06 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…