ఇంకా మొదలుకాకపోయినా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద అప్పుడే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. ప్రతి సినిమాకు హైప్ అంతకంతా పెంచుకుంటూ పోతున్న ఈ ట్రెండీ డైరెక్టర్ ఎన్ని లోపాలున్నా సరే లియోని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడో చూశాం. దాంట్లో జరిగిన పొరపాట్లు తలైవర్ చిత్రంలో రిపీట్ చేయనని హామీ ఇస్తున్న లోకేష్ విజయ్ లియోకి హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ నుంచి స్ఫూర్తి తీసుకున్న సంగతి తెలిసిందే. దాన్ని ఓపెన్ గా టైటిల్ కార్డులోనే వేసుకుని మరీ నిజాయితీ చూపించాడు.
ఇప్పుడు రజని 171 కోసం ఇదే ఫార్ములా వాడబోతున్నట్టు తెలిసింది. 2013లో వచ్చిన ‘ది పర్జ్’ ఆధారంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు ఇన్ సైడ్ టాక్. దీని కథ చాలా వెరైటీగా ఉంటుంది. అమెరికన్ ప్రభుత్వం ఓ పన్నెండు గంటల పాటు విచిత్రమైన జిఓ అమలు చేస్తుంది. దీని ప్రకారం ఆ సమయంలో ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినా ఎలాంటి చర్యలు ఉండవు. ఫోన్ చేసినా పోలీసులు రారు. హాస్పిటల్స్ కి కాల్ చేసినా ఆంబులెన్స్ పలకవు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో హీరో తనతో పాటు కుటుంబాన్ని, ఆపదలో ఉన్న వాళ్ళను ఎలా కాపాడతాడానే పాయింట్ తో రూపొందింది.
మన నేటివిటీకి ఇది సెట్ కాదు కాబట్టి మెయిన్ పాయింట్ తీసుకుని దానికి చాలా మార్పులు చేశారట. రజనికి బంగారం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ ని జోడించినట్టు మూడు రోజుల క్రితమే లీకయ్యింది. కళగు టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. ఈ లెక్కన లోకేష్ కనగరాజ్ ఎవరితో సినిమా చేసినా ఎక్కడి నుంచో ఇన్స్ పిరేషన్ తీసుకుంటూనే ఉంటాడన్న మాట. దీనికి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూర్చబోతున్నాడు. వేసవిలోగా షూటింగ్ మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో పూర్తి చేసేలా పక్కా ప్లాన్ సిద్ధమవుతోందట. ఖైదీ తరహాలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో కళగు ఉంటుందని మరో లీక్.
This post was last modified on April 5, 2024 8:29 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…