బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం అధికారికంగా ప్రకటించకుండానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రాజెక్టు ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి ఎప్పుడు ప్రారంభిస్తారనేది సస్పెన్స్ గా ఉంది. దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని, లాంఛనంగా గ్రాండ్ ఓపెనింగ్ చేయకపోయినా తనకున్న సెంటిమెంట్స్ ని అనుసరించి సైలెంట్ గా చేస్తున్నారని సమాచారం. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి మాత్రం ఇప్పటిదాకా ఖరారుగా వినిపిస్తున్న క్యాస్టింగ్ పేర్లు.
తీసేది హిందీలోనే అయినా ప్రతి భాషకు సంబంధించి అనువాదాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సంప్రదించినట్టు స్పెషల్ న్యూస్. దర్శకుడయ్యాక త్రివిక్రమ్ బయట సినిమాలకు రాయడం మానేశారు. విజయభాస్కర్ తో అనుబంధం, చిరంజీవి మీద అభిమానంతో ఒక్క జై చిరంజీవకు మాత్రమే డైలాగులు రాశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం భీమ్లా నాయక్, బ్రోలకు పెన్ను బలం అందించారు. అయితే రామాయణం డబ్బింగ్ మూవీ అవుతుంది కాబట్టి ఒప్పుకోవడం అనుమానమే.
కానీ నితీష్ ఆలోచన వేరుగా ఉందట. అవసరమైతే హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో వేర్వేరుగా షూట్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అలా జరిగిన పక్షంలో పైన చెప్పింది నిజం కావొచ్చు. ఇతిహాసాలు, పురాణాల మీద తిరుగులేని పట్టున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎస్ అనాలే కానీ అద్భుతమైన మాటలు చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ వద్దనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ గా సాయి మాధవ్ బుర్రాని అనుకుంటున్నారట. అధికారిక ప్రకటనలు వచ్చే దాకా ఇవన్నీ రైటో రాంగో చెప్పలేం కానీ మొత్తానికి లీకవుతున్న అప్డేట్స్ మాత్రం ఆసక్తికరంగానే ఉంటున్నాయి
This post was last modified on April 3, 2024 10:21 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…