ఇంకో రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెడుతున్న ఫ్యామిలీ స్టార్ సెన్సార్ పూర్తయ్యింది. 2 గంటల 43 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ చేశారు. సాధారణంగా ఇది కొంచెం పెద్ద లెన్త్ అనే చెప్పాలి. జానర్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే నిడివి పరంగానే ఖుషి ఇబ్బందులు ఎదురుకుని మిశ్రమ స్పందన దక్కించుకుంది. సరే కథ డిమాండ్ మేరకు చేసిందనుకున్నా నాలుగు అభ్యంతర పదాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అర్జున్ రెడ్డిలో పాపులరైన హిందీ ద్వందార్థ పదంతో కలిపి మొత్తం నాలుగు డైలాగుల్లో మ్యూట్ తో పాటు లిక్కర్ లేబుల్స్ మీద అభ్యంతరం చెప్పారు.
ఇదంతా ఓకే కానీ ముందు నుంచి పదే పదే కుటుంబ సమేతంగా బొమ్మరిల్లు తరహాలో చూదగ్గ చిత్రమంటూ నిర్మాత దిల్ రాజు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇలాంటి పదాలు వద్దని ముందే అనుకోవాలి. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని చెప్పొచ్చు కానీ అసలివి లేకుండా సన్నివేశంలో డెప్త్ పండదని చెప్పలేం కదా. రంగస్థలంలోనూ ఇలాంటిది వాడాల్సి వచ్చినప్పుడు దాని తగ్గ ఎమోషన్ ని దర్శకుడు సుకుమార్ బలంగా ఎస్టాబ్లిక్ చేయడం వల్లే పబ్లిక్ అంగీకరించారు. మళ్ళీ సినిమా మొత్తం ఇంకెక్కడా అలాంటి సంభాషణ ఉండదు. కానీ ఫ్యామిలీ స్టార్ కు నాలుగైదు ఇచ్చారు.
ఈ లెక్కన ఫ్యామిలీ స్టార్ కమర్షియల్ ప్యాకేజీగానే అనిపిస్తోంది. ఒకవేళ క్లీన్ యు వచ్చి ఉంటే వేరే సంగతి. అలా కాకుండా యు/ఏ ఇవ్వడంతో చిన్నపాటి డిబేట్ కు తావిచ్చినట్టు అయ్యింది. టాలీవుడ్ బాక్సాఫీస్ కు టిల్లు స్క్వేర్ ఇచ్చిన జోష్ ని ఫ్యామిలీ స్టార్ కొనసాగించాలని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. వేసవి సెలవులు, ఉగాది పండగ, లాంగ్ వీకెండ్ ఇలా ఎన్నో అంశాలు థియేటర్ల పరంగా సానుకూలంగా ఉన్నాయి. బాగుందనే టాక్ వస్తే ఎండలను సైతం లెక్క చేయకుండా ఏసీలో వినోదాన్ని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ వాడుకోవడమే తరువాయి.
This post was last modified on April 3, 2024 11:29 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…