క్రౌడ్ ఫేవరెట్ అనిపించుకున్న కంటెస్టెంట్‍ని కార్నర్ చేయడం, తద్వారా వాళ్ల అభిమానులకు ఆందోళన కలిగించడం, అలా షో టీఆర్పీ పెంచుకోవడం, అలాగే సోషల్ మీడియాలో తమ షో ట్రెండ్ అయ్యేట్టు చూసుకోవడం బిగ్‍బాస్ వేసే అనేకానేక జిత్తుల్లో ఒకటి. సెకండ్ సీజన్‍లో కౌశల్ ఫాన్స్ తో బిగ్‍బాస్ ఎమోషనల్ గేమ్ ఎలా వుండేదో తెలుసు కదా? గత సీజన్లో రాహుల్‍కి ఫాన్స్ పెరిగిన వెంటనే బిగ్‍బాస్ అతడితో ఆటలాడడం మొదలు పెట్టాడు.
అతను ఎలిమినేట్ అయిపోతాడేమో అనే భయాన్ని ఫాన్స్ లో పెంచి తద్వారా షో రేటింగ్స్ పెంచుకున్నారు. ఈ ఏడాది మొదటి వారంలోనే జనాల్లో ఎక్కువ శాతం దివిని సపోర్ట్ చేస్తున్నట్టు బిగ్‍బాస్ టీమ్ ఐడెంటిఫై చేసారు. అందుకే అప్పుడే అటు ఆమెతోను, ఇటు ఫాన్స్ తో గేమ్ మొదలు పెట్టేసారు. మొదటి వారం ఓటింగ్స్ లో ఎలిమినేషన్స్ చివరి వరకు దివిని సేవ్ చేయకుండా ఉంచేసారు. నిజానికి ఆమెకు ఓట్లు భారీగానే పోల్ అయినా కానీ ‘ఈసారికి తప్పించుకున్నావ్’ అని నాగార్జునతో అనిపించి ఆమెలో కంగారు పెంచారు. అలాగే ఫాన్స్ లో కూడా ఇన్‍సెక్యూరిటీ క్రియేట్ చేసారు.
దివి పెద్దగా మాట్లాడకపోయినా కానీ ఈజీగా ఇన్‍ఫ్లుయన్స్ కాదని, తన తెలివి తనకుందని రుజువు చేసుకుంది. టాస్కులలో కూడా యాక్టివ్‍గానే పార్టిసిపేట్ చేసింది. కానీ ఈసారికి తప్పించుకున్నావ్ అని చెప్పారు కాబట్టి నామినేషన్స్ లోకి వెళితే మాత్రం తడబడే అవకాశముంది. అది ఫాన్స్ ని మరింతగా అలర్ట్ చేస్తుంది. ఓటింగ్స్ కి అతీతంగా ఎవరినీ ఎలిమినేట్ చేయరు కానీ ఎమోషనల్ గేమ్ ఆడుతూ రేటింగ్స్ పెంచుకోవడానికి మాత్రం ఈసారి బిగ్‍బాస్ టీమ్‍కి త్వరగానే ఒక కంటెస్టెంట్ దొరికేసింది.
This post was last modified on September 14, 2020 8:50 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…