టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డిమాండ్ ఉన్న విలన్లలో జగపతిబాబుదే మొదటి స్థానమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 బాలకృష్ణ లెజెండ్ లో క్రూరమైన ప్రతినాయకుడిగా జగ్గూభాయ్ ప్రదర్శించిన నటన ఎంత గొప్పగా పండిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఈ బ్రేక్ ని తాను సరిగా సద్వినియోగపరుచుకోలేదని జగపతి బాబు ఇప్పుడు సారీ ఫీలవుతున్నారు. దాని తర్వాత 90కి పైగా సినిమాల్లో నటించినా అయిదారు మాత్రమే సంతృప్తినిచ్చాయని రంగస్థలం,అరవింద సమేత వీర రాఘవ, శ్రీమంతుడు లాంటి వాటిని ఉదాహరణగా చెప్పకొచ్చారు.
అవకాశాలు తగ్గిపోయి ఎవరైనా వేషాలు ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్న టైంలో లెజెండ్ వచ్చిందని, దాని తర్వాత లెక్కలేనన్ని ఆఫర్లు ఉక్కిరిబిక్కిరి చేయడంతో సంపాదనలో పడిపోయి అన్నీ ఒప్పేసుకుంటే జేబులు నిండాయి తప్ప జాబు శాటిస్ ఫ్యాక్షన్ మాత్రం మిగల్లేదని అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే గర్వంగా చెప్పుకునే క్యారెక్టర్లు మరిన్ని దక్కేవని అంటున్నారు. జగపతిబాబు అన్న మాటలు నిజమే. ఒక దశలో పదే పదే సూటు బూతు వేసుకున్న విలన్ పాత్రల్లో మొనాటని అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కన్నడ, తమిళంలో కూడా అదే తరహా చేశారు.
సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ జగపతిబాబుకి ఇంకా బోలెడు కెరీర్ ఉంది. లేట్ ఇన్నింగ్స్ లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తారనే వార్త ఆల్రెడీ చక్కర్లు తిరుగుతోంది. పుష్ప 2 ది రూల్, సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంలతో పాటు కల్కి 2898 ఏడిలో కూడా ఉన్నారని సమాచారం. అసలు జగ్గుభాయ్ ఏ ఏ చిత్రాల్లో నటిస్తున్నారనేది స్క్రీన్ మీద చూశాక కౌంట్ చేసుకుంటే తప్ప లెక్క తేలడం లేదు. అంత బిజీగా ఆర్టిస్టుగా ఉన్నారాయే. రామ్ చరణ్ బుచ్చిబాబు ఆర్సి 16లోనూ ఒక ముఖ్య భూమిక దక్కించుకున్నారని వినికిడి.
This post was last modified on April 2, 2024 3:00 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…