బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలకు అన్నీ భలేగా కలిసి వస్తాయి. కంటెంట్ యావరేజ్‌గా ఉన్నా సరే.. అవి ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే మూవీకి అలాగే కలిసొస్తోంది. సిద్ధు జొన్నలగడ్డకు ఉన్న మంచి ఇమేజ్.. డీజే టిల్లు పాత్ర పట్ల జనాల్లో ఉన్న క్రేజ్.. చాన్నాళ్లుగా సరైన సినిమా లేక బాక్సాఫీస్ స్లంప్‌లో ఉండడం.. పైగా వేసవి సీజన్.. ఇవన్నీ కలిసి వచ్చి ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతోంది.
ఇలాంటి మీడియం రేంజ్ మూవీకి తొలి రోజు రూ.25 కోట్ల వసూళ్లు రావడం అంటేనే ఒక సంచలనం. ఐతే టిల్లు స్క్వేర్ ఊపు ఒక్క రోజుకు పరిమితం కాలేదు. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగించింది. వరల్డ్ వైడ్ తొలి వీకెండ్లో ఏకంగా రూ.68 కోట్ల వసూళ్లు రాబట్టింది టిల్లు స్క్వేర్.
ఈ సినిమా రేంజికి ఈ వసూళ్లు అసాధారణం. విశేషం ఏంటంటే.. ఈ వీకెండ్లో ఇండియా మొత్తానికి హైయెస్ట్ గ్రాసర్ ఇదే. బాలీవుడ్లో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించిన క్రేజీ మూవీ క్రూ గత శుక్రవారమే రిలీజైంది. దానికి మంచి టాక్ కూడా వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఘనంగానే వచ్చాయి. కానీ ఆ సినిమా కూడా టిల్లు స్క్వేర్ వెనుకే నిలిచింది.
దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ చిత్రానికి వచ్చిన వసూళ్ల కంటే రీజనల్ మూవీ అయిన టిల్లు వసూళ్లే ఎక్కువ. క్రూ మూవీకి వీకెండ్లో రూ.62.5 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దానికంటే టిల్లు స్క్వేర్‌కు ఐదు కోట్లు ఎక్కువే కలెక్షన్ వచ్చింది. ఇండియాలో మరే భాషలో సినిమాలు కూడా ఈ వీకెండ్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. యుఎస్‌లో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా ఉండడం విశేషం.
This post was last modified on April 1, 2024 10:40 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…