Movie News

పృథ్విరాజ్ అభిమానులకు బడేమియా టెన్షన్

ఇటీవలే విడుదలైన ది గోట్ లైఫ్ ఆడు జీవితంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటనకు సర్వత్రా నీరాజనాలు అందుతున్నాయి. జాతీయ అవార్డు వస్తే ఆశ్చర్యం లేదని, ఆస్కార్ కు సైతం పంపాల్సిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడని విమర్శకులు పొగుడుతున్నారు. ఇందులో అతిశయోక్తి లేదు. అయితే తెలుగులో టిల్లు స్క్వేర్ ప్రభంజనం, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ క్రేజ్ వల్ల ఆశించిన స్థాయిలో రన్ రావడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మలయాళం వెర్షన్ ఆదివారం ముందే 50 కోట్ల గ్రాస్ దాటేయడమే కాక కేరళ టాప్ 5లో చోటు సంపాదించడం ఖాయమని అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కాసేపు పక్కనపెడితే పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించిన బాలీవుడ్ మూవీ బడేమియా చోటేమియా ఏప్రిల్ 10 రంజాన్ కానుకగా రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో కూడా రానుంది. అయితే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద నెగటివ్ క్యాంపైన్ ఎక్కువగా జరుగుతోంది. రొటీన్ యాంటీ పాకిస్థాన్ అంశాన్ని తీసుకుని, ఇద్దరు ఫ్లాప్ హీరోలతో సూపర్ హిట్ సినిమా తీసే ప్రయత్నం చేశారని నెటిజెన్లు తలంటారు. అలాంటి సినిమాలో శత్రుదేశం ప్రతినిథిగా నటించాడు పృథ్విరాజ్ సుకుమారన్.

ఒకవేళ ఈ పాత్ర కనక రొటీన్ గా ఉంటే కనక ట్రోలింగ్ కు గురి కావాల్సి వస్తుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గోట్ లైఫ్ ఆడు జీవితం తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అదంతా బడేమియా చోటేమియా వల్ల తగ్గిపోకూడదు. నిజానికి ట్రైలర్ లో పృథ్విరాజ్ మొహాన్ని రివీల్ చేయలేదు. కేవలం మాస్క్ ఉన్న మనిషిగా చూపించారు. అలాని వెరైటీ గెటప్ ఏమి ఉండదు. ఎన్నో సినిమాల్లో చూసిన తరహాలో డిజైన్ చేశారు. ఇదంతా ఓకే కానీ క్లైమాక్స్ లో అక్షయ్, టైగర్ ల చేతిలో దెబ్బలు తిని చనిపోయే ఎపిసోడ్ మాత్రం ఉండకూడదని ఫ్యాన్స్ కోరిక. జరిగే పనేనా. 

This post was last modified on March 31, 2024 11:16 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago