యువ దర్శకులు కొందరు స్టేజ్ మీద డ్యాన్సులవీ వేస్తుంటారు కానీ.. స్టార్ డైరెక్టర్లు ఆ పని చేయడం అరుదు. దర్శకులంటే హుందాగా ఉండాలి, డ్యాన్సులేయడం ఏంటి అనే అభిప్రాయంతో ఉంటారు చాలామంది. ఐతే ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడైన రాజమౌళి ఒక వేడుకలో డ్యాన్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విశేషం ఏంటంటే.. ఆయనతో పాటుగా భార్య రమ కూడా నృత్యం చేయడం.
ఐతే వీళ్లిద్దరూ కలిసి స్టేజ్‌పై సందడి చేసింది సినిమా వేడుకలో కాదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఆ వేడుక ఏంటి అనే వివరాలు తెలియలేదు కానీ.. ఫ్యామిలీ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అక్కడి వారందరినీ అలరించారు.
ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. పాటకు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు రాజమౌళి, రమ. జక్కన్న చాలా హుషారుగా స్టెప్పులేస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రెండేళ్ల కిందట ఆర్ఆర్ఆర్‌తో పలకరించాక కొంత కాలం విశ్రాంతి తీసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో మునిగిపోయారు. ఈ మధ్యే స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర బృందం.
ఎప్పుడూ రాజమౌళి సినిమాలకు ఛాయాగ్రహణం అందించే సెంథిల్ కుమార్ వేరే కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. పి.ఎస్.వినోద్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇది ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని టీం ముందు నుంచి చెబుతోంది. ప్రస్తుతం మహేష్ ఈ మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మెగా మూవీ సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
This post was last modified on March 31, 2024 11:18 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…